ఎయిర్‌టెల్ నుంచి ఉచితంగా హలోట్యూన్, సెట్ చేసుకోవడం ఎలా ?

ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రత్యర్థి రిలయన్స్ జియోకు పోటీగా  భారతీ ఎయిర్‌టెల్ కూడా తన సబ్‌స్క్రైబర్లకు ఫ్రీగా కాలర్ ట్యూన్ సదుపాయం అందిస్తోంది. వింక్ మ్యూజిక్ యాప్ సాయంతో కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఉచిత కాలర్ ట్యూన్ సదుపాయం పొందాలంటే సబ్‌స్క్రైబర్లు కనీసం రూ.129 లేదా ఆపై ప్లాన్‌ను కలిగి ఉండాలి. ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇంతకు ముందు ఎయిర్‌టెల్ కస్టమర్ల నుంచి హలో ట్యూన్స్ కోసం నెలకు రూ.36 వసూలు చేసేది.

ఎలా సెట్ చేసుకోవాలి
ఉచిత హలో ట్యూన్‌లను సెట్ చేయడానికి మీరు వింక్ మ్యూజిక్ యాప్ ని డౌన్‌లోడ్ చేయాలి. ఇది iOS మరియు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లకు అందుబాటులో ఉంది. యాప్ ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి అక్కడ కనిపించే ‘హలో ట్యూన్స్' ఫీచర్ ని నొక్కండి. మీరు యాప్ విండో యొక్క కుడి ఎగువ భాగంలో చిహ్నాన్ని కనుగొంటారు. ఈ వింక్ యాప్ ద్వారా  ఎయిర్టెల్ కస్టమర్లు తమకు ఇష్టమైన పాటల కోసం సెర్చ్ చేయవచ్చు నచ్చిన హలో ట్యూన్ ఎంచుకోవచ్చు. 

మీకు భాష తెలియకుంటే  వింక్ మ్యూజిక్ యాప్ 12 కేటగిరిల్లో మొత్తం 15 భాషలలో పాటలను అందిస్తోంది. ఇందులో ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, హర్యన్వి, భోజ్‌పురి, బెంగాలీ, ఒరియా, అస్సామీ మరియు రాజస్థానీ ఉన్నాయి.  వింక్ మ్యూజిక్ లైబ్రరీలో మొత్తంగా 40 మిలియన్ పాటలు 'హలో ట్యూన్స్' గా అందుబాటులో ఉన్నాయని  ఎయిర్‌టెల్ కంపెనీ తెలిపింది.

న్యూస్ టెక్నాలజీ భారతి ఎయిర్‌టెల్ రిలయన్స్ జియో టెలికాం హలో ట్యూన్స్ వింక్ మ్యూజిక్ యాప్ కాలర్ ట్యూన్