జియో గిగా ఫైబ‌ర్ లాంచ్ లోపు ఇత‌ర కంపెనీల చౌక ఆఫ‌ర్లేమిటి? 


జియోతో టెలికాం ఇండ‌స్ట్రీ రూపురేఖ‌ల్నే మార్చేసిన రియ‌ల‌న్స్ గ్రూప్ జియో గిగాఫైబ‌ర్ పేరుతో బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్‌ను లాంచ్ చేస్తామ‌ని ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. నెల‌కు 100 జీబీ డేటా అది కూడా హై స్పీడ్‌తో ఇవ్వ‌బోతోంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా చేసుక‌వ‌చ్చ‌ని చెబుతోంది. రిజిస్ట్రేష‌న్లు కూడా స్టార్ట్ చేసింది. తొలి మూడు నెల‌లు ఫ్రీ స‌ర్వీస్ ఇస్తుంద‌న్న ప్ర‌చారంతో జ‌నం భారీగానే రిజిస్ట్రేష‌న్లు చేసుకుంటున్నారు. జియో ఇచ్చే పోటీని తట్టుకోవ‌డానికి ఇప్ప‌టికే బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీసులు అందిస్తున్న టెలికం కంపెనీలు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డం మొద‌లుపెట్టాయి.  వాటిమీద ఓ లుక్కేద్దాం ప‌దండి. 
 

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌
ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ రేట్లు త‌గ్గించింది. అలాగే చాలా న‌గ‌రాల్లో ఫెయిర్ యూసేజ్ పాల‌సీ (FUP) లిమిట్స్‌ను కూడా ఎత్తేసింది. అంటే అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవ‌చ్చ‌న్న‌మాట‌. అయితే ఎయిర్‌టెల్ ఆఫ‌ర్లు వెబ్‌సైట్‌లో చూసి మీకు కూడా వ‌ర్తిస్తాయ‌నుకంఉటే ప‌ప్పులో కాలేసిన‌ట్లే. ఉదాహ‌ర‌ణ‌కు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఎయిర్‌టెల్ 599 ప్లాన్‌లో 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెల‌కు 30 జీబీ డేటాను ఇస్తుంది. అయితే దీనికి మ‌రో 40 రూపాయ‌లు క‌లిపి 639 ప్లాన్ క‌నుక  తీసుకుంటే మీకు నెల‌కు 100 జీబీ డేటా వ‌స్తుంది. అంటే 40 రూపాయ‌లు ఎక్స్‌ట్రా పే చేస్తే మీకు 70 జీబీ డేటా అద‌నంగా వ‌స్తుంది.  కానీ మీరు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ చూస్తే 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెల‌కు 100 జీబీ డేటా ఇచ్చే ప్లాన్లు 799 రూపాయ‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని చూపిస్తుంది. 

* నెట్ స్పీడ్‌తో పెద్ద‌గా పనిలేదు అనుకునేవారికి మ‌రో ఆఫ‌ర్ కూడా ఉంది. 399 రూపాయ‌ల‌కే 100 జీబీ డేటా ఇస్తుంది. అయితే స్పీడ్ 8 ఎంబీపీఎస్ లోపే ఉంటుంది. 

*ఒక్కో సిటీకి ఒక్కో ర‌క‌మైన ఆఫ‌ర్ ఉంటుంది. ముంబ‌యిలో 8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా కావాల‌నుకుంటే 699 రూపాయ‌లవుతుంది. అందే హైద‌రాబాద్‌లో ఈ ప్లాన్ ధ‌ర 349 రూపాయ‌లు మాత్ర‌మే. 

* కొన్ని సిటీల్లో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌తోపాటు ఫ్రీ ల్యాండ్ లైన్ స‌ర్వీసులు కూడా ఇస్తోంది. మ‌రికొన్ని చోట్ల ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ. 

అందుకే మీరు ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి లేటెస్ట్ ఆఫ‌ర్లేమిటో క‌నుక్కుంటే మీకు త‌క్కువ రేట్‌లోనే ఎక్కువ డేటా, ఎక్కువ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ దొరుకుతుంది. అవ‌స‌ర‌మైతే మీరు బేర‌మాడొచ్చు కూడా. ఇలాంటి వారికి కంపెనీలు  ఎక్కువ డేటా లేదా ఎక్కువ వ్యాలిడిటీ కూడా ఆఫ‌ర్ చేస్తాయి. 

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ 
ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా బ్రాడ్‌బ్యాండ్ రేట్లు త‌గ్గించింది. 699 రూపాయ‌లు క‌డితే 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఏకంగా 700 జీబీ డేటా వాడుకోవ‌చ్చు.  ఆ లిమిట్ దాటాక కూడా 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా ఇస్తుంది. 

Jio GigaFiber broadband Airtel broadband BSNL Broadband  Best broadband plans జియో గిగాఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ Â