పెళ్లిళ్ల‌లో డ్రోన్లు వాడుతున్నారా? అయితే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

ప్ర‌స్తుతం పెళ్లిళ్ల తంతు పూర్తిగా మారిపోయింది. హైటెక్ యుగంలో వివాహ వేడుక‌ను చిత్రీక‌రించేందుకు డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. వీటి క‌మ‌ర్షియ‌ల్ ఉప‌యోగం నానాటికీ అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో.. పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది. డిసెంబ‌రు 1 నుంచి ఇవి అమ‌లులోకి రానున్నాయి. ఒక‌వేళ వీటిని అతిక్ర‌మిస్తే.. వివాహ వేడుక‌లో అప‌శ్రుతులు ఎదుర‌వ‌డంతో పాటు పోలీస్ కేసు కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుందని పౌర‌విమానయాన శాఖ డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్‌(డీజీసీఏ) స్ప‌ష్టం చేశారు. దేశంలో ఈ డ్రోన్లు ఉప‌యోగించేందుకు తీసుకోవాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుదల చేశారు. పెళ్లిళ్ల సీజ‌న్ మొద‌ల‌య్యే డిసెంబ‌ర్ 1 నుంచి వీటిని త‌ప్పనిస‌రిగా పాటించాలి. సో ఇక నుంచి డ్రోన్‌ను ఎటు కావాలంటే అటు, ఎంత పైకి కావాలంటే అంత పైకి ఎగిరేలా చేసి ఫొటోల‌ను తీసుకోవ‌డం కుద‌ర‌ద‌న్నమాట‌. 

నానో డ్రోన్లు
ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తులు, అధికారుల నుంచి అనుమ‌తుల బాధ‌లు లేకుండా ఉండాలంటే సులువుగా 250 గ్రాముల బ‌రువు మించ‌కుండా ఉండే ఒక చిన్న డ్రోన్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. 

* డీజీసీఏ నుంచి అన్‌నేమ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆప‌రేట‌ర్ ప‌ర్మిట్(యూఏవోపీ), యునిక్ ఐడెంటిఫికేష‌న్ నంబ‌ర్‌(యూఐఎన్‌) పొందేందుకు నానో డ్రోన్లకు మిన‌హాయింపు ఉంది. 

* భూ ఉప‌రితలం నుంచి 50 అడుగులు ఎత్తులో వీటిని ఎగ‌రేయ‌వ‌చ్చు. 

* విమానాలు ప్ర‌యాణించేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) నిర్ధారించిన ఉప‌రిత‌లంలో ఈ నానో డ్రోన్లు ఎగిరేందుకు వీలు లేదు. అలాగే మాన‌వ‌, మాన‌వ‌రహిత ఎయిర్ క్రాఫ్ట్‌ల ప‌క్క‌న ప్ర‌యాణించ‌కూడ‌దు. 

* ఒక‌వేళ ఏటీసీ నియంత్రిత ప్ర‌దేశంలో డ్రోన్ ప్ర‌యాణించాలంటే యూఐఎన్‌, యూఏవోపీకి ద‌ర‌ఖాస్తు త‌ప్ప‌నిస‌రి. అంతేగాక డ్రోన్‌కి నో ప‌ర్మిష‌న్‌- నో టేకాఫ్‌(ఎన్‌పీఎన్‌టీ) ఉండాలి. ఇవ‌న్నీ తీసుకున్న‌ప్పుడు మాత్ర‌మే ఏటీసీ ప‌రిస‌రాల్లోకి వెళ్ల‌వ‌చ్చు. 

* ఇత‌రుల వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌, ఇత‌ర అంశాలకు ఎటువంటి ఉల్లంఘ‌న జ‌ర‌గ‌ద‌ని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. 

మైక్రో డ్రోన్లు
250 గ్రాముల కంటే ఎక్కువ- 2కిలోలు, అంతకంటే త‌క్కువ బ‌రువున్న డ్రోన్లు ఈ కేట‌గిరీలోకి వ‌స్తాయి. 

* భూ ఉప‌రిత‌లానికి 200 అడుగుల ఎత్తులోపు డ్రోన్లు ప్ర‌యాణించాలంటే అన్‌నేమ్‌డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆప‌రేట‌ర్ ప‌ర్మిట్ అనుమతి అవ‌స‌రం లేదు కానీ.. స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో మాత్రం 24 గంట‌ల ముందు లిఖిల‌పూర్వ‌కంగా తెలియ‌జేయాలి. 

* నో ప‌ర్మిష‌న్‌-నో టేకాఫ్‌(ఎన్‌పీఎన్‌టీ) అనుమ‌తి తప్ప‌నిస‌రి. డిజిట‌ల్ స్కై ప్లాట్‌ఫాం(అన్‌నేమ్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌(యూటీఎం)ను నియంత్రించేందుకు తొలిసారి ఏర్పాటుచేసిన‌ది) ద్వారా కూడా ఎగిరేందుకు ప‌ర్మిష‌న్ తీసుకోవాలి. డీజీసీఏ వెబ్‌సైట్ ద్వారా ఈ యూటీఎం  డిసెంబ‌ర్ 1 నుంచి అందుబాటులోకి వ‌స్తుంది. 

* యూఐఎన్ తీసుకోవడం త‌ప్ప‌నిస‌రి. 

* రాత్రి స‌మ‌యంలో, సూర్యాస్త‌మ‌య వేళ‌ల్లో డ్రోన్లు ఉప‌యోగించ‌డం పూర్తిగా నిషిద్ధం. అయితే రాత్రి వేళ‌ల్లో అయినా పూర్తిగా డోర్లు వేసి వెళుతురు ఉన్న ప్రాంతాల్లో ఏజీఎల్ అనుమ‌తించిన 200 అడుగుల వ‌ర‌కూ మైక్రో డ్రోన్‌తో వీడియో తీసుకోవ‌చ్చు.

డ్రోన్లు పెళ్లిళ్లు Civil aviation ministry commercial use of drones wedding photography Directorate General of Civil Aviation do’s and don’ts for flying drones in India wedding season wedding planners