కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటించి దేశాలకు దేశాలే ఈ మహమ్మారి ఎప్పుడు వదులుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టెలికం కంపెనీలు బాధితులకు కొంత భరోసా ఇస్తున్నాయి. జియో తన డేటా ఓచర్ల మీద డబుల్ డేటా ఇస్తోంది. వర్క్ ఫ్రం హోం చేసుకునేవారికి, ఇంట్లో నుంచి కదలకుండా ఉండిపోయినవారు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ అదనపు డేటా పనికివస్తోందని జియో చెప్తోంది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా కరోనా సందర్భంగా వినియోగదారులకు భరోసాగా ఉండేందుకు కొన్ని ఆఫర్లు తీసుకొచ్చింది.
నెల రోజులపాటు ఫ్రీ బ్రాడ్బ్యాండ్
ఇంట్లో నుంచి బయటికి రాలేని ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేవారికి ఉపయోగపడేలా నెల రోజులపాటు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ను ఫ్రీగా ఇవ్వబోతోంది.
ప్రస్తుతం ఉన్న యూజర్లతోపాటు కొత్తగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ ఉండి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లేనివారు కూడా ఈ వన్ మంత్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ను ఉచితంగా వాడుకోవచ్చు.
వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బాంజాల్ చెప్పారు.
ఫోన్ కనెక్షన్ తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఫ్రీ
కాపర్ కేబుల్తో కొత్త కనెక్షన్ తీసుకునేవారికి ఇన్స్టాలేషన్ ఛార్జీలు కూడా ఉచితమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
బీఎసà±à°Žà°¨à±à°Žà°²à± క‌రోనా à°¸à±à°ªà±†à°·â€Œà°²à± ఆఫ‌రà±à°¸à±â€Œ బీఎసà±à°Žà°¨à±à°Žà°²à± ఆఫ‌రà±à°¸à±â€Œ బీఎసà±à°Žà°¨à±à°Žà°²à± à°«à±à°°à±€ హైసà±à°ªà±€à°¡à± à°¬à±à°°à°¾à°¡à±â€Œà°¬à±à°¯à°¾à°‚à°¡à±â€Œ BSNL Carona Offers BSNL Free High speed broadband BSNL Plans