మొబైల్ డేటా అయిపోయిందా.. 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస్తే 50 జీబీ డేటా విన్నారా?

లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండిపోయి మొబైల్ డేటా మీదే అన్ని ప‌నులూ చ‌క్క‌బెట్టుకుంటున్న‌వారికి ఇప్పుడు డేటా కొర‌త వ‌చ్చిప‌డుతోంది.  సాధార‌ణంగా రోజుకు 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ వాడేవాళ్లు మామూలు రోజుల్లో దానిలో స‌గం కూడా ఖ‌ర్చు చేయ‌లేక‌పోయేవారు. అయితే ఇప్పుడు పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాస్‌లు, యూట్యూబ్‌లో వంట‌కాల కోసం గృహిణులు, ఆఫీస్ వ్య‌వ‌హారాల కోసం మ‌గ‌వాళ్లు ఇలా ఎవ‌రికి వారు డేటా వాడేస్తుండ‌టంతో ఇప్పుడు డేటా కొర‌తగా మారుతోంది. అందుకే జియో, ఎయిర్‌టెల్ ఇప్ప‌టికే డేటా బూస్ట‌ర్ ప్యాక్‌లు తీసుకొచ్చాయి.  ఇప్పుడు వొడాఫోన్ కూడా సేమ్ ప్యాక్ తీసుకొచ్చింది.

వొడాఫోన్ 251 రూపాయ‌ల ప్లాన్‌
ఇప్ప‌టికే వ్యాలిడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్న‌వారికే ఇది వ‌ర్తిస్తుంది. 251 రూపాయ‌ల‌తో ఈ ప్యాక్ తీసుకుంటే 50 జీబీ డేటా వ‌స్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు.  ఎలాంటి కాలింగ్‌, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండ‌వు. ప్ర‌స్తుతానికి గుజ‌రాత్, బీహార్‌, చెన్నై, ఒరిస్సా, త‌మిళ‌నాడు,యూపీ ఈస్ట్‌, కేర‌ళ టెలికం స‌ర్కిల్స్‌కు మాత్ర‌మే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో మిగ‌తా స‌ర్కిల్క్‌కూ రానుంది.

జియో, ఎయిర్‌టెల్‌లోనూ
డేటా అయిపోయిన క‌స్ట‌మ‌ర్ల‌కు డేటా అవ‌స‌రాలు తీర్చేందుకు జియో, రిల‌య‌న్స్ కూడా ఇంత‌కుముందే ఈ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. సేమ్ వీటిలో కూడా 251 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయిస్తే 50 జీబీ డేటా వ‌స్తుంది. కాల్స్‌,ఎస్ఎంఎస్‌ల వంటి ఇత‌ర స‌దుపాయాలేమీ ఉండ‌వు.

 

Mobile data packs Vodafone 251 data plan Airtel 251 data plan Jio 251 data plan వొడాఫోన్ 251 డేటా ప్లాన్ ఎక్స్‌ట్రా మొబైల్ డేటా జియో 251 డేటా ప్లాన్‌ ఎయిర్‌టెల్ 251 డేటా ప్లాన్‌