లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఎక్స్‌ట్రా ఛార్జి లేకుండా
సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని ఎక్స్‌టెండ్ చేయడానికి కొంత ఛార్జి చేస్తాయి. చాలామంది ఫోన్ కొనుక్కునేటప్పుడే ఈ అదనపు వారంటీని కూడా కొంటారు. కొన్ని కంపెనీలు ఫోన్ వాడుతున్నప్పుడు కూడా ఈ ఆఫర్ వర్తిస్తాయి. అయితే లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అదనపు చార్జి లేకుండానే కంపెనీలన్నీ ఫోన్ వారంటీని పొడిగించటం శుభవార్తే.
శాంసంగ్ మే 31 వరకు
శాంసంగ్ తన మొబైల్ ఫోన్ యూజర్లకు మే31 వరకు వారంటీని పెంచింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 30లోగా వారంటీ మగిసిన కస్టమర్లకే ఈ ఆఫర్ అని ప్రకటించింది.
రియల్‌మీ మే 31 వరకు
రియల్‌మీ తన మొబైల్ ఫోన్ యూజర్లకు మే31 వరకు వారంటీని పెంచింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 30లోగా వారంటీ మగిసిన కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది.
ఒప్పో ఫోన్లకూ మే 31 వరకు
ఒప్పో తన వినియోగదారుల్లో మార్చి 23 తర్వాత వారంటీ పిరియడ్ ముగిసిన యూజర్లందరికీ మే 31 వరకు వారంటీ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పో స్మార్ట్ వాచ్‌లు, ఇతర యాక్సెసరీస్‌కు కూడా ఇదే ఆఫర్ ఇస్తోంది.
వివో కూడా
వివో కూడా తన డివైస్‌లు వాడేవారికి మే 31 వరకు వారంటీని పెంచింది. మార్చి 25 తర్వాత వారంటీ కంప్లీట్ అయినవారందరికీ ఈ ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పింది.
వన్‌ప్లస్
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మార్చి 1 నుంచి మే 30 లోపల వారంటీ ముగిసే తన కస్టమర్లందరికీ మే 31 వరకు వారంటీని పొడిగిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
నోకియాలో 60 రోజులు
నోకియా అయితే రెండు నెలల వారంటీ పిరియడ్ పొడిగించింది. మార్చి 15 నుంచి మే 15 వరకు వారంటీ ముగిసిన నోకియా ఫోన్ యూజర్లందరూ ఈ ఆఫర్ వాడుకోవచ్చు.
హువావే, హానర్ జూన్ 30 వరకు
హువావే, దాని సబ్‌బ్రాండ్ అయిన హానర్ కంపెనీల వినియోగదారులకు మరింత శుభవార్త. మార్చి 21 నుంచి జూన్ 21లోపు వారంటీ ముగిసిన తమ కస్టమర్లంతా జూన్ 30 వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని వాడుకోవచ్చని ప్రకటించింది.
లెనోవో మే 31 దాకా
లెనోవో, మోటోరోలా యూజర్లకు మార్చి 15 నుంచి ఏప్రిల్ 30 లోగా ఫోన్ వారంటీ ముగిసినా మే 31 వరకు వారంటీ కొనసాగిస్తామని లెనోవో చెప్పింది.
ఇన్ఫినిక్స్ మే 31
మార్చి 20 తర్వాత వారంటీ ముగిసిన వారంతా మే 31 వరకు వారంటీని పొందవచ్చని ఇన్ఫినిక్స్ ప్రకటించింది.
ఐటెల్ 2 నెలలు
ప్రధానంగా ఫీచర్ ఫోన్లు అమ్మే ఐటెల్ కూడా మంచి ఆఫరే ఇచ్చింది. మార్చి 20 నుంచి మే 31 లోగా వారంటీ ముగిసిపోయే ఫోన్లకు రెండు నెలలు గడువు పెంచింది.
లావా కూడా 2 నెలలు
లావా కూడా ఐటెల్ లాగే మంచి ఆఫర్ ప్రకటించింది. మార్చి 15 నుంచి మే 15 లోగా వారంటీ ముగిసిపోయే ఫోన్లకు రెండు నెలలు గడువు పెంచింది.
lock down offers mobile phone warranty mobile phone extended warranty మొబైలౠఫోనౠవారంటీ సెలà±â€Œà°«à±‹à°¨à± వారంటీ పొడిగింపౠసెలà±â€Œà°«à±‹à°¨à± à°Žà°•à±à°¸à±â€Œà°Ÿà±†à°‚డెడౠవారంటీ లాకà±â€Œà°¡à±Œà°¨à±â€Œà°²à±‹ à°¶à±à°â€Œà°µà°¾à°°à±à°¤â€Œ