100 రూపాయ‌ల్లోపు రీఛార్జి ప్లాన్స్‌లో బెస్ట్ ఏదీ?

గ‌త డిసెంబ‌ర్ నెల‌లో అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జి ప్లాన్స్ ధ‌ర‌లు పెంచేశాయి.  100 రూపాయ‌ల్లోపు ధ‌ర‌ల్లో ఉన్న రీఛార్జి ప్లాన్స్‌లో కూడా మార్పులు వ‌చ్చాయి. ఈ ప‌రిస్థితుల్లో 100 రూపాయ‌ల్లోపు రీఛార్జి ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏది ఒక కంపారిజ‌న్ చూద్దాం.

ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ లో 100 రూపాయల్లోపు ధరలో నాలుగు ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్స్ వున్నాయి.

ఎయిర్‌టెల్ 48 ప్లాన్  
ఇది కేవలం డాటా  ప్యాక్.  48 రూపాయల రీఛార్జి చేస్తే  3 జీబీ డేటా ఇస్తుంది. వ్యాలిడిటీ  28 రోజులు

ఎయిర్‌టెల్ 49 ప్లాన్
49 రూపాయల రీఛార్జి చేస్తే 38.52 టాక్ టైం,  100 ఎంబీ  డేటా ఇస్తుంది. వ్యాలిడిటీ  28 రోజులు.

ఎయిర్‌టెల్ 79 ప్లాన్  
ఇది కేవలం డాటా  ప్యాక్.  79 రూపాయల రీఛార్జి చేస్తే  69 రూపాయల టాక్ టైం, 200 ఎంబీ  డేటా ఇస్తుంది. వ్యాలిడిటీ  28 రోజులు.

ఎయిర్‌టెల్ 98 ప్లాన్
ఇది కేవలం డాటా  ప్యాక్.  98 రూపాయల రీఛార్జి చేస్తే  6 జీబీ   డేటా ఇస్తుంది. వ్యాలిడిటీ  28 రోజులు

జియో 49 ప్లాన్
ఇది కేవలం జియో ఫోన్ యూజర్లకు మాత్రమే.  49 రూపాయల రీఛార్జి చేస్తే జియో నుంచి జియోకి అన్ లిమిటెడ్ టాక్ టైం, ఇతర నెట్వర్క్ లకు 250 నిమిషాల టాక్ టైం,  2 జీబీ   డేటా ఇస్తుంది. వ్యాలిడిటీ  14 రోజులు.

జియో 69 ప్లాన్
ఇది కూడా కేవలం జియో ఫోన్ యూజర్లకు మాత్రమే.  69 రూపాయల రీఛార్జి చేస్తే జియో నుంచి జియోకి అన్ లిమిటెడ్ టాక్ టైం, ఇతర నెట్వర్క్ లకు 250 నిమిషాల టాక్ టైం,  రోజుకు 500 ఎంబీ డేటా  ఇస్తుంది. వ్యాలిడిటీ  14 రోజులు.      

జియో 75 ప్లాన్
ఇది జియో యూజర్లకు అందరికీ .  75 రూపాయల రీఛార్జి చేస్తే త్రీ జీబీ   డేటా మాత్రమే ఇస్తుంది. వాలిడిటీ  28 రోజులు.

వొడాఫోన్
వొడాఫోన్ ఐడియా లో కూడా వంద రూపాయలు లోపు రెండు రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి

వొడాఫోన్ ఐడియా 39 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు. 30 రూపాయల టాక్ టైం, 100 ఎం బి డేటా ఇస్తుంది.

వొడాఫోన్ ఐడియా 79 ప్లాన్
దీని వ్యాలిడిటీ 25 రోజులు. 64 రూపాయల టాక్ టైం, 200 ఎం బి డేటా ఇస్తుంది.

 

Prepaid plans under 100 Rs Best prepaid mobile plan under 100 100 రూపాయ‌ల్లోపు బెస్ట్ రీఛార్జి ప్లాన్‌ మొబైల్ రీఛార్జి ప్లాన్స్‌ ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ జియో రీఛార్జి ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ వొడాఫోన్ ఐడియా జియో వ‌ర్సెస్ వొడాఫోన్ ఐడియా