మన దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. కరెంట్ బిల్లు నుంచి మొదలుకొని....ఎవరికైనా డబ్బులు చెల్లించాలన్నా....కూర్చున్న చోట నుంచే చెల్లించే రోజులివి. అయితే డిజిటల్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రకరకాల యాప్స్ ను ఇన్ స్టాల్ చేస్తుంటారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఎలా ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటివల్ల అంతగా నష్టం లేదు కానీ...ఎనీ డెస్క్ అనే యాప్ మీ ఫోన్లో ఉన్నట్లయితే...చాలా డేంజర్. మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయం అవడం ఖాయం.
ఎనీ డెస్క్ యాప్ ద్వారా యూపీఐ ఆన్ లైన్ చెల్లింపుల వ్యవస్థపై మోసాలు జరగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయాన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్పింది. ఎనీ డెస్క్ ద్వారా లావాదేవీలు జరిపే బ్యాంకులు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది కూడా. ఎనీ డెస్క్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు...యూజర్ల అకౌంట్ల నుంచి డబ్బును మాయం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ యాప్ మన అకౌంట్లో నుంచి డబ్బును ఎలా కొట్టెస్తుందో తెలుసుకుందాం.
* మీ మొబైల్ కు ఫోన్ చేసి ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం అంటూ...ప్రారంభిస్తారు. మీ దృష్టిని మళ్లించడానికి అచ్చం బ్యాంకు ప్రతినిధిలాగే మాట్లాడుతాడు.
* ఎనీ డెస్క్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాని మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. తాను RBI నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మిస్తాడు.
*నిజంగానే బ్యాంకును ఫోన్ చేసినట్లుగా మిమ్మల్ని నమ్మించడానికి...మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలను అడుగుతారు.
*వివరాలు చెప్పకుంటే..మీ కార్డు బ్లాక్ అవుతుందని చెబుతారు. ఏదోలా మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు.
*మీరు ఎనీ డెస్ యాప్ ను డౌన్ లోడ్ చేసిన తర్వాత..ప్రైవసీ కోసం ఇత యాప్స్ అనుమతి అడుగుతుంది.
* మీరు ఈయాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాక...మీ డివైజు మీ ఆధీనంలో ఉండదు.
* ఈ ప్రాసెస్ పూర్తయ్యాక...సైబర్ నేరగాళ్లు..మీ ఫోన్లో ఉన్న తొమ్మిది అంకెల యాప్ కోడును అడుగుతాడు.
*తొమ్మిది అంకెల కోడ్ ను పొందిన తర్వాత...డివైజు నుంచి యాక్సెస్ చేయమని అడుగుతాడు.
*దీంతో బాధితులు అనుమతి లేకుండా డివైజు రిమోట్ పూర్తిగా నేరగాళ్ల చేతిల్లోకి వెళ్తుంది.
*డివైజుకు రిమెట్ గా కనెక్ట్ చేయడానికి ఎనీ డెస్క్ యాప్ ఈజీగా ఉంటుంది. యూజర్లకు ఎనీ డెస్క్ యాప్ గురించి అవగాహన లేకపోవడం మోసగాళ్లకు సాధనంగా మారుతుంది.
*ఈ యాప్ ను ఉపయోగించడం ద్వారా...సైబర్ నేరగాళ్లు UPI నెంబర్ లేదా మొబైల్ వ్యాలేట్స్ ద్వారా డబ్బను దొంగిలించవచ్చని RBIహెచ్చరించింది.
ఎనీ డెసà±à°•ౠసైబరౠనేరగాళà±à°²à± లావాదేవీలౠఆరà±à°¬à°¿à° ANY DESK SYBER frauds RBI