ఎస్.బి.ఐ మనల్ని పదే పదే అలర్ట్ చేస్తున్న ఈ వాట్సాప్ స్కాం మీకు తెలుసా?

వాట్సాప్ వాడుతున్న యూజర్లందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)అలర్ట్ మెసేజులను జారీ చేసింది. వాట్సాప్ ద్వారా మీ పర్సనల్ వివరాలు, బ్యాంకు వివరాలను పంపమని ఎస్బిఐ అడుగుతున్నట్లు తప్పుడు మెసేజులు వస్తున్నాయని అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని వినియోగదారులకు హెచ్చరికల సందేశాలను జారీ చేసింది. 

ఈ స్కామ్ కు పాల్పడినవారు బ్యాంకు అధికారులుగా....కస్టమర్లను నమ్మిస్తారు. కస్టమర్ల డెబిల్ లేదా క్రెడిట్ కార్డును అప్ గ్రేడ్ లేదా రిన్యూ చేసుకోవాలని వారిని ఒప్పిస్తారు. వారి మాటలను నమ్మి కస్టమర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నెంబర్లు, cvv,గడువు తేదీని అడగానే చెప్పేస్తారు. అయితే ఇలాంటి పొరపాటు మీరు చేయకండి. 

అయితే  కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఇటువంటివి అందుకున్నట్లుగా కంప్లయింట్లు వస్తున్నాయని ఓటీపీ అడుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని తెలిపారు. వీటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. 
వాట్సప్ లో కొంతమందికి మీరు చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ గెలుచుకున్నారని దీనిని మీ బ్యాంకు అకౌంట్లలోకి పంపిచేందుకు ఓటీపీ చెప్పాలని అడుగుతున్నారు. అయితే అది ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దు. మరికొందరు ఈ లింక్ క్లిక్ చేసి మీరు గెలుచుకున్న మొత్తాన్ని చూడవచ్చంటూ ఓ లింక్ పంపిస్తారు. అటువంటి వాటిని ఓపెన్ చేయవద్దు. అవి ఓపెన్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని వారు వేరే విధంగా హ్యాక్ చేసి మీ అకౌంట్లు గుల్ల చేసే అవకాశం ఉంది. బ్యాంకు ఎంప్లాయినంటూ పరిచయం చేసుకునే వారిని అస్సలు నమ్మవద్దు. వారు మీ డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు అప్ డ్రేడ్ చేశాం. దానిని చెక్ చేసేందుకు వివరాలు చెప్పమని అడుగుతారు. మీరు పొరపాటున సివివి నంబర్ చెబితే మీ అకౌంట్లోని మొత్తాన్ని కాజేస్తారు.

ఇక మెసేజుల ద్వారా కూడా ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. మీరు హ్యాకర్లు పంపిన లింకులను క్లిక్ చేస్తే ఆటోమేటిగ్గా మీ సమాచారం వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. వారు CVV, గడువు తేదీ, కార్డు నెంబరు  లాంటి వాటిని ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇలాంటి స్కాముల్లో ఇరుకున్నట్లయితే వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయండి. మూడు రోజుల్లో మీ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడుతుంది. మీరు ఒకవేళ ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 1-800-111109కి కాల్ చేసి వివరాలను చెబితే వారు మీకు ఏదైనా సాయం చేస్తారు. మీరు మెసేజ్ ద్వారా వివరాలను పంపాలనుకుంటే "Problem" అని టైప్ చేసి 9212500888 కి smsచేయండి. లేకుంటే ట్విట్టర్ ద్వారా @SBICard_Connectకి రిపోర్ట్ చేయండి.
 

ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్ స్కాం sbi state bank of india whatsapp scam