గూగుల్ మెయిల్ డాట్ ఫీచ‌ర్ వ‌ల్ల క్రెడిట్ కార్డు మోసాలు... త‌స్మాత్‌ జాగ్ర‌త్త‌!

జీమెయిల్.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఉప‌యోగించే మెయిలింగ్ సర్వీసు. కాలానుగుణంగా దీనిలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఎన్నో ఫీచ‌ర్ల‌ను గూగుల్ త‌న జీమెయిల్‌లో యాడ్ చేసింది. అయితే వాట‌న్నింట‌ని మ‌నం ఉప‌యోగించం. అలాంటి వాటిలో జీ మెయిల్ డాట్ ఫీచ‌ర్ ఒక‌టి. అయితే దీని వ‌ల్ల లాభం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే మ‌న‌ల్ని ప‌క్క‌దోవ ప‌ట్టించి.. న‌ష్టంలోకి లాక్కెల్లే ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఇటీవ‌లే తేలింది. జీమెయిల్ డాట్ ఫీచ‌ర్ ద్వారా క్రెడిట్ కార్డు మోసాలు జ‌రుగుతున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. మ‌రి దీని ద్వారా ఎలా మోసం చేస్తున్నారు.. మ‌నం బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా?

బిజినెస్ ఈమెయిల్ స్కామ్స్ చేయ‌డానికి మొద‌ట‌గా ఈ జీమెయిల్ డాట్ ఫీచ‌ర్‌ని ఉప‌యోగించిన‌ట్లు వెల్ల‌డైంది. నిజానికి ఈ డాట్ ఫీచ‌ర్ వ‌ల్ల చాలా ఉప‌యోగాలు ఉన్నాయి. మ‌నం ఎవ‌రికైనా మెయిల్ పంపుతున్న‌ప్పుడు మెయిల్ అడ్ర‌స్‌లో పొర‌పాటున డాట్ పెట్టినా లేదా స్పేస్ ఇచ్చినా కూడా వాళ్ల అకౌంట్‌కే రీడైరెక్ట్ అవుతాయి. దీని వ‌ల్ల మ‌నం త‌ప్పు చేశామ‌న్న సంగ‌తి తెలిసిపోతుంది. ఇప్పుడీ ఫీచ‌ర్‌నే సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫేక్ ఇన్‌కంట్యాక్స్ రిట‌ర్న్‌ల కోసం, ప్ర‌భుత్వ ఏజెన్సీల నుంచి ఆర్థిక ల‌బ్ధి కోసం కూడా వాళ్లు ఈ డాట్ ఫీచ‌ర్‌ను వాడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా క్రెడిట్ కార్డులను మిస్ యూజ్ చేయ‌డం కోసం ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌ధానంగా ఉప‌యోగిస్తున్నారు. 

ఈ స్కామ్ విష‌యాన్ని సెక్యూరిటీ ఏజెన్సీ అగారి మొద‌ట క‌నిపెట్టింది. బిజినెస్ ఈమెయిల్ కాంప్ర‌మైజ్ కోసం మొద‌ట ఈ జీమెయిల్ డాట్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించిన‌ట్లు తెలిసింది. అయితే ఇలా డాట్ ఫీచ‌ర్ వ‌ల్ల ఉన్న ఉప‌యోగాన్ని క‌నిపెట్టినే సైబ‌ర్ క్రిమిన‌ల్స్ అమెరికాలో ఒక బ్యాంకుకు మెయిల్స్ పంపి 46, 52,400 రూపాయిల డ‌బ్బును త‌స్క‌రించారు. ఇదంతా వాళ్లు క్రెడిట్ కార్డు ద్వారానే చేశారు. అంతేకాక వాళ్లు 14 భిన్న‌మైన అకౌంట్లు ఉప‌యోగించి ఫేక్ ఇన్‌కంట్యాక్స్ రిట‌ర్న్‌ల‌ను దాఖ‌లు చేసి డ‌బ్బులు దొంగిలించారు. ఇదంతా జీమెయిల్ డాట్ ఫీచ‌ర్లో ఉన్న లొసుగుల వ‌ల్లే సాధ్య‌మైంది. అందుకే మ‌న‌కు వ‌చ్చే ఈమెయిల్స్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని లింక్స్ క్లిక్ చేయ‌కూడ‌ద‌ని.. సున్నిత‌మైన స‌మాచారాన్ని ఈమెయిల్ ద్వారా పంపే స‌మ‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని సైబ‌ర్ నిపుణులు చెబుతున్నారు. యాంటీ వైర‌స్‌ను వాడ‌డం వ‌ల్ల కూడా స్పామ‌ర్ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని వాళ్లు స‌ల‌హా ఇస్తున్నారు. 

credit card fraud gamil DOT future