ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

ఆన్‌లైన్  మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు.  అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం. 

ఎలా జ‌రిగిందంటే..
ఇటీవల ఉత్తర‌ప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసాడు. అయితే కాసేపటికి దాన్ని కాన్సిల్ చేయాలనుకున్నాడు. యాప్ ఫోన్ నంబర్ అందులో కనపడకపోవడంతో గూగుల్లో సెర్చ్ చేశాడు. సదరు ఫుడ్ డెలివరీ యాప్ పేరుతో ఒక టోల్ ఫ్రీ నంబర్ కనిపించింది. వెంటనే ఆ నెంబర్ కి కాల్ చేసి తన ఆర్డర్ కాన్సిల్ చేయమన్నాడు. అయితే దురదష్టవశాత్తూ ఆ టోల్ ఫ్రీ నంబర్ ఫుడ్ డెలివరీ యాప్ వారిది కాదు. ఆ పేరుతో ఆన్లైన్ మోసగాళ్ళు పెట్టిన నంబర్. ఆర్డర్ కాన్సిల్ చేయమని ఆ వ్యక్తి ఫోన్ చేయగానే ఆన్లైన్ మోసగాడు అతన్ని తెలివిగా బుట్టలో వేశాడు. మీ ఆర్డర్ కాన్సిల్ చేస్తున్నాం. అయితే ఆ డబ్బులు రిఫండ్ రావాలంటే మీరు మీ మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని యాప్ పేరు చెప్పాడు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక అందులో మీ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ ఎంటర్ చేస్తే ఆ అకౌంట్ కి మీ డబ్బులు తిరిగి వస్తాయని నమ్మబలికాడు. అతను చెప్పినట్టే యాప్ డౌన్లోడ్ చేశాడు. 

రిమోట్ షేరింగ్ యాప్‌తో బురిడీ
అది రిమోట్ షేరింగ్ ద్వారా అవతలి వారి మొబైల్ స్క్రీన్ ను ఎక్కడి నుంచి అయినా చూడడానికి వేలు కల్పించే యాప్. అలా ఆ రిమోట్ షేరింగ్ యాప్ ద్వారా మోస‌గాడు అతని మొబైల్ స్క్రీన్ చూశారు.  ఆ అకౌంట్ డిటైల్స్ తో లాగిన్ అయి 4 లక్షలు ట్రాన్స్ఫర్ పెట్టేశారు. ఇవేమీ అసలు వ్యక్తికి తెలియవు. యాప్ డౌన్లోడ్ చేసి, బ్యాంక్ డిటైల్స్ ఎంటర్ చేసి  రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా మోసగాడు మీకు ఒక ఓటీపీ  వస్తుంది. అది మాకు చెబితే మీ అమౌంట్ రీ ఫండ్ చేస్తాం అన్నాడు. నమ్మిన ఆ వ్యక్తి ఓటీపీ చెప్పాడు. అంతే అతని అకౌంట్ నుంచి 4 లక్షలు కొట్టేశాడు. 

ఇలా జాగ్ర‌త్త‌ప‌డండి
* ఇలాంటి మోసాలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. అందుకే గూగుల్ లో టోల్ ఫ్రీ నంబర్ చూసి కాల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

* టోల్‌ఫ్రీ నంబ‌ర్ల‌లోగానీ,  బ్యాంకింగ్‌, ఈకామ‌ర్స్, ఫుడ్ డెలివ‌రీ యాప్స్‌కు సంబంధించిన వారితో ఎవ‌రితోనైనా ఫోన్‌లో  మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పారని ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చెయ్యొద్దు. 

* మీ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, ఓ టీ పీ యెట్టి పరిస్థి తుల్లోనూ చెప్పొద్దు.

ఫుడ్ ఆర్డ‌ర్ క్యాన్సిలేష‌న్‌తో 4 ల‌క్ష‌ల న‌ష్టం ఆన్‌లైన్ ఫ్రాడ్‌ ఫుడ్ డెలివ‌రీ యాప్స్ పేరుతో మోసం online crime cyber crime food delivery app scam