డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన భీమ్ యాప్ మనందరికీ తెలిసిందే. అయితే ఈ భీమ్ యాప్కు సంబంధించిన సైబర్ నేరగాళ్లు ఓ ఫేక్ కాల్సెంటర్ను సృష్టించారు. దానిలో వాళ్లిచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి ఓ భీమ్ యూజర్ ఏకంగా 40 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దీనికి భీమ్ బాధ్యత వహిస్తుందా? లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
ఇదీ భీమ్ కథ
డిజిటల్ ఎకానమీని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహించడానికి సెంట్రల్ గవర్నమెంట్.. పెద్ద నోట్ల రద్దు సమయం నుంచి ఎంతగానో ప్రయత్నిస్తోంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లు చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుందని, అప్పుడు ఎవరూ పన్ను ఎగ్గొట్టలేరన్నది గవర్నమెంట్ లెక్క. దీన్ని పేటీఎం, మొబీక్విక్, ఫ్రీఛార్జ్, ఫోన్పే లాంటి ప్రైవేట్ కంపెనీలు వెంటనే అందిపుచ్చుకుని ముందుకెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వం తరపున ఓ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)ని ఇంట్రడ్యూస్ చేసింది. భీమ్ (BHIM) పేరుతో తీసుకొచ్చిన ఈ యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)రన్ చేస్తోంది.
మోసం ఎలా జరిగింది?
ముంబయిలో నివాసం ఉంటున్న అనిల్ చతుర్వేది అనే యువకుడు భీమ్ యాప్ ద్వారా ప్రతి నెలా తన తల్లిదండ్రులకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం ఇలాగే 10వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మనీ వాళ్ల తండ్రి అకౌంట్కు చేరలేదు. కానీ అనిల్ అకౌంట్లో నుంచి డెబిట్ అయిపోయాయి. కొన్ని గంటలపాటు చూసినా మనీ తనకు తిరిగి రాకపోవడంతో అనిల్ భీమ్ కాల్ సెంటర్కు ఫోన్ చేద్దామని నెట్లో వెతికాడు. అక్కడ ఓ ఫోన్ నెంబర్ కనిపించింది. దానికి కాల్ చేశాడు. అది ఫేక్ కాల్ సెంటర్. అక్కడున్న ఎగ్జిక్యూటివ్ అనిల్ ఫోన్ విని ఇలా కామన్గా వచ్చే సమస్యే. మీరు వర్రీ అవకండి. మీ డబ్బులు మీకు తిరిగొస్తాయి అని చెప్పాడు. మీ మొబైల్కి భీమ్ కాల్ సెంటర్ నుంచి కొన్ని నోటిఫికేషన్లు వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పాడు. దీంతో అనిల్ ఆ నోటిఫికేషన్లు యాక్సెప్ట్ చేశాడు. వెంటనే అతని భీమ్ అకౌంట్లో నుంచి 40వేలు డెబిట్ అయిపోయాయి. వెంటనే అనిల్ ముంబయిలోని వెర్సోవా పోలీస్స్టేషన్లో కంప్లయింట్ చేశాడు.
ఎన్పీసీఐ, భీమ్ ఎవరు బాధ్యత వహిస్తారు?
అయితే ఇప్పుడు ఈ కేసులో అనిల్ పోగొట్టుకున్న నలభై వేల రూపాయలకు భీమ్ గానీ, దాని పేరెంట్ ఆర్గనైజేషన్ అయిన NPCI గానీ బాధ్యత వహించవు. భీమ్ యాప్ క్రియేట్ చేసిన ఎన్పీసీఐ తన రూల్ బుక్లో దీని గురించి క్లియర్గా చెప్పింది. ప్రైవేట్ సంస్థల్లో ఫ్రాడ్ జరిగితేనే స్పందించాల్సిన గవర్నమెంట్ ఇప్పుడు తమ ఆధీనంలో ఉన్న సంస్థ యాప్ను ఉపయోగిస్తున్న యూజర్ దానికి ఎవరో తయారు చేసిన నకిలీ వెబ్సైట్ బారినపడి 40 వేల రూపాయలు పోగొట్టుకుంటే దానిమీద యాక్షన్ తీసుకోవాలని అనిల్ కోరుతున్నాడు. లేకపోతే ఇక గవర్నమెంట్ యాప్ వాడడంలో తమకు సౌకర్యం ఏంటని అతని ప్రశ్న. కానీ సమాధానం చెప్పేవారెవరు?
BHIM Fraud  BHIM fake call center à°à±€à°®à± à°«à±à°°à°¾à°¡à±â€Œ à°à±€à°®à± ఫేకౠకాలౠసెంట‌రà±â€Œ Â