మీ ఈమెయిల్ ఐడీ లీక్ అయ్యిందో లేదో చెప్పే HAVE I BEEN SOLD

ఈ-మెయిల్ తెర‌వ‌గానే కుప్ప‌లు తెప్పలుగా స్పామ్ మెసేజ్‌లు వ‌చ్చిప‌డిపోతుంటాయి. కొన్నింటిని మ‌న‌కి తెలియ‌కుండా స‌బ్‌స్క్రైబ్ చేసుకుంటే.. మ‌రికొన్ని వాటంత‌ట అవే మెయిల్‌కి లింక్ అయిపోతాయి. వీటిని అన్‌స‌బ్‌స్క్రైబ్ చేసేందుకు ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా.. వాటి డేటాబేస్ నుంచి మ‌న మెయిల్ ఐడీ తొలగించ‌డం సాధ్యం కాని ప‌ని. మెయిల్ ఐడీ లీక్ అయిందో లేదో గుర్తించి వాటి నుంచి నుంచి ర‌క్షించే ఒక స‌ర్వీస్ అందుబాటులో ఉంది. అదే HaveIBeenSold. 

ఎలా ప‌నిచేస్తుంది?
దీనిని ఉప‌యోగించడం చాలా సుల‌భం. ఇందులో ముందుగా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్క‌డ క‌నిపించే ఆప్ష‌న్లో మ‌న ఈమెయిల్ ఐడీని ఎంట‌ర్ చేయాలి. మెయిల్ ఐడీకి లింక్‌ అయి ఉంటే డేటాబేస్‌ల వివ‌రాల‌న్నీ స్క్రీన్ మీద క‌నిపిస్తాయి. వీటిలో మ‌న మెయిల్ ఐడీ లీక్ అయింద‌ని గ‌మ‌నిస్తే.. వారిని త‌మ డేటాబేస్ నుంచి మెయిల్ ఐడీని తొలగించాల‌ని కోర‌చ్చు. వెబ్‌సైట్‌లోనే కాదు.. యాప్‌లోనూ ఈ సదుపాయం ఉంది. ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇల్లీగ‌ల్ డేటాబేస్‌లో మ‌న ఈ-మెయిల్ ఐడీ ఉన్న‌ట్లు గుర్తిస్తే.. వెంట‌నే అల‌ర్ట్ నోటిఫికేష‌న్లు కూడా వ‌స్తాయి. HaveIBeenSold స‌భ్యులు చెబుతున్న ప్ర‌కారం.. ఈ ఇల్లీగ‌ల్ డేటాబేస్‌ను వీరు కొనుగోలు చేస్తారు. త‌ర్వాత మ‌న ఈమెయిల్ ఐడీ అడ్ర‌స్‌ను నిరంత‌రం చెక్ చేస్తుంటారు. మ‌న మెయిల్ ఐడీ ఎప్పుడైనా ఇందులో క‌నిపిస్తే.. నోటిఫికేష‌న్ ఇస్తుంటారు. అయితే మెయిల్ ఐడీని ఇటువంటి లీకుల నుంచి పూర్తిగా రక్షించుకునేందుకు అవ‌కాశ‌మే లేదా అనే సందేహాలు కూడా వ‌స్తుంటాయి. ఇది పూర్తిగా సాధ్యం కాక‌పోయినా.. కొన్ని చర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల లీక్ అవ‌డం నుంచి కాపాడుకోవ‌చ్చు. సొంతంగా క‌స్ట‌మ్ డొమైన్‌ని కొనుగోలు చేసుకోవ‌డంతో పాటు డిస్పోజ‌బుల్ ఈమెయిల్ స‌ర్వీస్‌ని ఉప‌యోగించి మెరుగైన ఫ‌లితాలు పొందవ‌చ్చట‌.  

Catchall కూడా..
మెయిల్ స‌ర్వ‌ర్ నుంచి బ‌య‌ట‌కు రాకుండానే ఇలాంటి ఈ-మెయిల్ స‌ర్వీస్‌ను పొందేందుకు Catchall ఫీచ‌ర్ కూడా అందుబాటులో ఉంది. ఇందుకోసం ఒక ఫిల్ట‌ర్‌(లేబుల్‌)ను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ లేబుల్‌తో మొద‌లైన మెయిల్స్ అన్నీ ఈ ట్రాప్ ఫోల్డ‌ర్‌లోకి వెళిపోతాయి. కొన్ని కీవ‌ర్డ్స్ కూడా ఇస్తే.. వాటితో వ‌చ్చిన మెయిల్స్ అన్నింటినీ Catchall స‌ర్వీస్ గుర్తించి ఈ ట్రాప్ పోల్డ‌ర్‌లోకి తీసుకెళ్లేలా చేస్తుంది. అంతేగాక మ‌న ఈమెయిల్ ఐడీ లీక్ అయిన డేటాబేస్ స‌ర్వీసుల‌ను కూడా తెలియ‌జేస్తుంది.  

haveibeensold email spam leak app protect ఈమెయిల్ స్పామ్ యాప్ ప్రొటెక్ట్