మీ ఫోన్ సీరియ‌ల్ నెంబ‌ర్ ద్వారా మిమ్మ‌ల్ని హ్యాక్ చేయ‌చ్చా?

సెల్‌ఫోన్‌, టీవీ, ఫ్రిజ్ ఇలా మీరు ఏ ఎలక్ట్రానిక్ వ‌స్తువు కొన్నా ఆ బాక్స్ మీద ఓ సీరియ‌ల్ నెంబ‌ర్ ఉంటుంది. అది ఆ ప్రొడ‌క్ట్ యొక్క యూనిక్ నెంబ‌ర్‌.  అది ఒక ప్రొడ‌క్ట్‌కి ఒక‌టి మాత్ర‌మే ఉంటుంది. కంపెనీ వారంటీ ఇవ్వాలంటే మ‌న‌ల్ని ఆ నెంబ‌రే అడుగుతుంది. అలాంటి సీరియల్ నెంబ‌ర్ మీ ఫోన్‌కి కూడా ఉంటుంది క‌దా.. ఆ నెంబ‌ర్‌తో మీ ఫోన్‌ను హ్యాక్ చేసే అవ‌కాశం ఉందా?  తెలుసుకోండి మ‌రి..

ఎలా ఉంటుంది?
సీరియ‌ల్ నెంబ‌ర్లు అక్ష‌రాలు, అంకెల‌తో క‌లిసి ఉంటాయి. RZ81304314N , YN44123#KA ఇలా ఉంటాయి. మీ డివైస్ సీరియ‌ల్ నెంబ‌ర్‌.. దాని బాక్స్ మీద‌ S/N అని ఉండొచ్చు. చాలా డివైస్‌ల స్మార్ట్ ఫోన్ల నెంబ‌ర్లు About device అనే దానికింద సాధార‌ణంగా ఉంటాయి. దీన్ని ఆ బాక్స్ చూసిన‌వాళ్లు ఎవ‌రైనా ఈజీగా గుర్తు ప‌డ‌తారు. అయితే ఆ సీరియ‌ల్ నెంబ‌ర్ తెలుసుకున్నంత మాత్రాన మీ డివైస్‌ను యాక్సెస్ చేస్తారా అంటే చేయ‌లేరు.

ఇంక స‌మ‌స్యేంటి?
సీరియ‌ల్ నెంబ‌ర్‌తో మీ డివైస్‌ను హ్యాక్ చేయ‌లేరు కానీ మీకున్న రీప్లేస్‌, స‌ర్వీస్ వారంటీని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అంటే మీ ఫోన్‌లాంటి ఫోన్ వేరేవాళ్ల‌కు ఉంది. వాళ్లు ఫోన్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి మీ ఫోన్ సీరియ‌ల్ నెంబ‌ర్ చెప్పి వారంటీ, స్పార్‌పార్ట్స్ రీప్లేస్ చేయించుకోవ‌చ్చు. కంపెనీ స‌ర్వీస్ సెంట‌ర్లలో అన్నీ ప‌క్కాగా ఉంటాయి కాబ‌ట్టి కుదర‌క‌పోవ‌చ్చు కానీ ఇప్పుడు పెద్ద కంపెనీల‌న్నీ మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న చిన్న చిన్న సెల్‌ఫోన్ రిపేర్ షాప్‌లతో కూడా టైఅప్ పెట్టుకుని, లేదంటే అక్క‌డున్న చిన్న మెకానిక్‌ల‌కు ట్రైనింగ్ ఇచ్చి మీ ఫోన్ల స‌ర్వీసింగ్ చేయిస్తున్నాయి. అలాంటి చోట్ల సీరియ‌ల్ నెంబ‌ర్ చెప్పి మానేజ్ చేయొచ్చు. కొన్ని కంపెనీలు కేవ‌లం సీరియ‌ల్ నెంబ‌ర్ అడిగి ఫ్రీ స‌ర్వీస్ లేదా వారంటీఇచ్చేస్తాయి. అలా వేరే వాళ్లు మీ సీరియ‌ల్ నెంబ‌ర్ వాడేసుకుంటే మీకు నిజంగా ఫోన్‌కు వారంటీ లేదా స్పేర్ పార్ట్స్ అవ‌స‌ర‌మైతే ఆల్రెడీ వాడేసుకున్నారని రిప్ల‌యి రావ‌చ్చు.  అందుకే సాధార‌ణంగా వారంటీ కోసం వెళితే చాలా మంది బాక్స్ కూడా అడుగుతారు.  

ఏం చేయాలి?
ఇలా జ‌ర‌గ‌డానికి అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి కానీ అస‌లు జ‌ర‌గ‌వ‌ని చెప్ప‌డానికి లేదు. అందుకే మీ ఫోన్ బాక్స్‌ను ఇంట్లో దాచిపెట్టండి. అంతేకానీ కొత్త ఫోన్ కొన్నామ‌ని బాక్స్‌తో పాటు దాన్ని ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయొద్దు.  వారంటీలో ఉన్న మీ ప్రొడ‌క్ట్‌కు సంబంధించిన సీరియ‌ల్ నెంబ‌ర్‌, మోడ‌ల్ టైప్ వంటి వివ‌రాల‌ను బ‌హిరంగ ప‌ర‌చవ‌ద్దు.. అది మీ పేరు చెప్పి మీ వారంటీని వేరే వాళ్లు వాడుకునే ప్ర‌మాదానికి దారి తీస్తుంది అని లెనోవో ప్ర‌తినిధి ఒకరు చెప్పారు.

Hack Into Your Phone Using the Serial Number Cyber Crime సైబ‌ర్ క్రైమ్‌ ఫోన్ సీరియ‌ల్ నెంబ‌ర్‌ ఫోన్ సీరియ‌ల్ నెంబ‌ర్‌తో హ్యాకింగ్‌