వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

వాట్సప్ 10వ వార్షికోత్సవంలో భాగంగా 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తుందంటూ మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా, అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఇదో పెద్ద డేటా స్కాం. సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఉండే ఈ ఈ లింక్ పై క్లిక్ చేయమని మెసేజ్ వస్తే  తొందరపడి దాన్ని క్లిక్ చేయకండి. వాట్సప్ డొమైన్‌లో ఈ రకమైన అనుమానాస్పద మెసేజ్ లకు స్పందించకపోవడమే మంచిది. ఇలాంటి లింక్ లపై క్లిక్ చేయగానే అది నేరుగా మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. 

అక్కడ సర్వే పేరుతో కొన్ని సిరీస్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా అడుగుతుంది. ఆ తర్వాత ఆ మెసేజ్ ను మరో 30 మంది యూజర్లకు ఫార్వార్డ్ చేయాల్సిందిగా సూచిస్తుంది. అలా చేస్తే బిగ్ రివార్డుకు క్వాలిఫై అవుతారని ఆఫర్ చేస్తుంది. ఇదో డేటా స్కాంగా రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. బిజినెస్ ప్రమోషన్‌లో భాగంగా థర్డ్ పార్టీల నుంచి ఇలాంటి మెసేజ్ లు ఫార్వర్డ్ అయితే కాస్త ఆలోచించి క్లిక్ చేయండి. ముందుగా ఆ కంపెనీ వెబ్ సైట్ చెక్ చేయండి. ప్రమోషన్స్ రియలా? లేదా ఫేక్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 

కాగా క్లిక్‌ల కోసం ఇలా హ్యాకర్లు ట్రిక్ ప్లే చేస్తుంటారు. మానిటైజేషన్ స్కీంలో రెవిన్యూ జనరేషన్ కోసమే ఇలా చేస్తారు. ESET రీసెర్చర్ల ప్రకారం.. యాడ్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. యూజర్లు ఎంతమంది క్లిక్ చేస్తే.. వారికి అంత రెవిన్యూ జనరేట్ అవుతుంది. 

2017లో ఇలాంటి వాట్సప్ స్కాం వెలుగులోకి వచ్చింది. అన్ లాక్ ఫ్రీ ఇంటర్నెట్ యాక్సస్ అంటూ వాట్సప్ లో ఓ మెసేజ్ తెగ వైరల్ అయింది. ప్రీమియం క్లికింగ్ చేయించడం లేదా ఖరీదైన SMS సర్వీసులు లేదా థర్డ్ పార్టీ యాప్స్ ను యూజర్ల ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలని మెసేజ్‌లు వచ్చాయి. 2018లో ఇదే తరహా మోసగాళ్లు ఫ్రీ అడిడాస్ షూలు అంటూ వాట్సప్ యూజర్లకు ఎరగా చూపారు. ఇలాంటి మెసేజ్‌లతో వాట్సప్ యూజర్లను బురిడీ కొట్టించి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారని ESET రీసెర్చర్లు చెబుతున్నారు.

వాట్సాప్ వాట్సప్ ఫ్రీ ఇంటర్నెట్ డే స్కామ్ డేటా స్కాం