వాట్సప్ ఎక్కువమంది యూజ్ చేస్ మెసేజింగ్ యాప్. అయితే మీరు ఈ మెసేజింగ్ యాప్‌ను సరిగా ఉపయోగించకపోతే ముప్పు తప్పదు. ఎందుకంటే మనం గ్రూప్‌లలో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రమాదకర మేసేజ్‌లు చేయడం వల్ల అది వారికే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అంటే వారు అడ్మిన్ అయితే జైల్‌కు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పోస్టులు చేస్తున్న వారిని బ్యాన్ చేయాలని వాట్సప్ నిర్ణయించుకుంది.
వివాదాస్పదంగా ఉంటే..
మన పోస్టులు వివాదాస్పదంగా ఉండకూడదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు. ఇలా ఉంటే కచ్చితంగా వాట్సప్ దృష్టి పడే అవకాశాలున్నాయి. ఉదాహరణకు రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదం చాలా సున్నితమైంది. ఇటీవలే సుప్రీం కోర్టు ఈ కేసులో తుది తీర్పు వెలువరించింది. హిందువులకు అనుకూలంగా ఈ తీర్పు వచ్చింది. అయితే ఇలాంటి సమయంలో చాలామంది వేరే మతస్తులను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారు. వాటిని తొలగించాలని కేంద్రం వాట్సప్‌ను కోరింది. ఇలా ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. అలాంటి అకౌంట్లు కలిగి ఉన్నవారిని పూర్తిగా నిషేధించాలని వాట్సప్ ప్రయత్నిస్తోంది.
పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త
మనం వాట్సప్‌లో ఒక గ్రూప్‌ను మెయింటెన్ చేస్తున్నప్పుడు గ్రూప్ పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిషేధిత పేర్లు లేదా ఎవరినైనా కించపరిచే పేర్లు పెట్టకూడదు. ఇలా పెట్టినందుకే రాడిట్ గ్రూప్‌కు చెందిన కొంతమంది నిషేధానికి గురయ్యారు. ట్విటర్ కూడా ఇలాంటి వారిని గుర్తించి వారి అకౌంట్లను బ్లాక్ చేస్తుంది. దుష్ప్రచారాలు చేస్తున్నవారిని, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నవారిని ఫేస్‌బుక్ కూడా వదలట్లేదు. సోషల్ మీడియో సైట్ల నుంచి పర్మినెంట్ బ్యాన్ ఎదుర్కోకూడదనుకుంటే పేర్ల విషయంలో మాత్రమే కాదు కంటెంట్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏదైనా పోస్టును ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే గుడ్డిగా దాన్ని వేరెరొకరికి ఫార్వడ్ చేయద్దు. ఇలా చేయకపోవడం వల్ల ఫేక్ న్యూస్ ఏదో ఒక దశలో ఆగిపోతుంది.
Whatsapp Permanently Ban Groups Malicious Names