ఉచితంగా వస్తుందంటే ఆశ ఉండనిది ఎవరికి? అందుకేఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్లోగానీ ఆర్థిక పరమైన మోసాలన్నీఇలా ఉచిత ఆఫర్ల పేరు మీదే ఎక్కువగా వస్తుంటాయి. కంపెనీ ప్రమోషన్ కోసమో లేకపోతే మా కంపెనీ వార్షికోత్సవం కాబట్టి కొంతమంది కస్టమర్లను సెలెక్ట్ చేసి గిఫ్ట్‌లు ఇస్తున్నామనో మాయ చేస్తారు. 20 వేల రూపాయల ప్రొడక్ట్‌ను రెండు వేలకే ఇస్తామని నమ్మబలుకుతారు. ఆ అమౌంట్‌ను వాళ్ల అకౌంట్లోకి వేయించుకుని కొట్టేస్తారు. ఇప్పుడు గిఫ్ట్ కార్డ్‌ల పేరిట స్కామర్లు ఇదే రకమైన దందా మొదలుపెట్టారని సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ అమ్మే కేస్పర్ స్కై ల్యాబ్ తేల్చిచెప్పింది.
వల వేస్తారు..
నకిలీ వెబ్‌సైట్లు క్రియేట్ చేసి గిఫ్ట్ కార్డ్‌లు ఇస్తున్నామని వల వేస్తున్నారు. ప్రజల్ని సులువుగా నమ్మించేందుకు ఐ ట్యూన్స్, గూగుల్ ప్లే, అమెజాన్, స్టీమ్ లాంటి ఫేమస్ కంపెనీల పేరుతో వెబ్‌సైట్లు ఓపెన్ చేస్తున్నారు.
* సాధారణంగా ఇంటర్‌నెట్ యూజర్లలో చాలామంది ఆన్‌లైన్ గేమ్స్ ఆడినప్పుడు లేదా టాస్క్‌లు కంప్లీట్ చేసినప్పుడు వాళ్లకు గూగుల్ ప్లేస్టోర్, అమెజాన్ లాంటివి ప్రోమో కోడ్స్ లేదా డిస్కౌంట్ ఓచర్లు, గిఫ్ట్ ఓచర్లు ఇస్తుంటాయి. టోకెన్ ఫైర్, స్వాగ్‌బక్స్ లాంటి యాప్స్ కూడా ఇలా ఇస్తుంటాయి. ఇలాగే ఫేక్ సైట్లు క్రియేట్ చేసిన సైబర్ క్రిమినల్స్ కూడా యూజర్లకు టాస్క్‌లు పెడతారు.
* టాస్క్ కంప్లీట్ అయ్యాక గిఫ్ట్ ఓచర్ కోడ్ కోసం యూజర్ తాను రోబో కాదని నిరూపించుకోవాలి. ఇందుకోసం ఏదైనా కొన్ని నెంబర్లు, పేర్లు ఐడెంటిఫై చేయమని అడగగడం, ఈ మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నెంబర్ ఇవ్వమని కోరడం, పెయిడ్ ఎస్ఎంఎస్‌లకు సబ్‌స్క్రైబ్ చేయమని కోరడం, యాడ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయమని అడగడం ఇలా ఏదో ఒకటి అడుగుతారు.
* వీటిలో ఏది ఇచ్చినా చివరికి మీకు దక్కే గిఫ్ట్ ఓచర్ కోడ్‌లో ఏమీ ఉండదు. అది వేస్ట్ అని మీకు తెలిసినా అప్పటికే మీ టైమంతా వేస్టవుతుంది. అంతేకాదు మీ ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడీని మార్కెటింగ్ కంపెనీలకు ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటారు. లేదా మీకు పెయిడ్ ఎస్ఎంస్‌లు పంపించి డబ్బులు చేసుకుంటారు.
* అన్నింటికంటే ముఖ్యమైనది మీ బ్యాంకింగ్ వివరాల వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను వాళ్లు మీకు తెలియకుండానే సంపాదిస్తారు. దీంతో వాళ్లు మీ అకౌంట్‌ను హ్యాక్ చేసే ప్రమాదం కూడా ఉంది.
జాగ్రత్తలు తప్పనిసరి
గిఫ్ట్ కార్డ్‌లు, ఫ్రీ ఓచర్ల పేరిట జరిగే ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా కేస్పర్‌స్కై ల్యాబ్ చెప్పింది.
* ఉచితంగా ఇస్తామంటే దాన్ని వెంటనే నమ్మకండి.
* ఇలాంటి వెబ్‌సైట్లు ఓపెన్ చేసినప్పుడు HTTPS కనెక్షన్, డొమైన్ నేమ్ చెక్ చేయండి. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా సైట్లు, ఈమెయిల్స్ సంబంధించిన వాటి విషయంలో పక్కాగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో డేటా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది.
* మీ లాగిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ కార్డ్ డిటెయిల్స్ లాంటి సెన్సిటివ్ డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి.
* టాస్క్‌లు, గేమ్స్ వంటి వాటికి సంబంధిచిన లింక్స్‌ను కొంత మందికి షేర్ చేయండి. మీకు ఎక్స్‌ట్రా గిఫ్ట్ ఓచర్లు, ఎక్స్‌ట్రా డిస్కౌంట్లు ఇస్తామని చెబుతుంటాయి. పెద్ద కంపెనీలు, స్టాండర్డ్ సైట్లు అయితేనే తప్ప ఇలాంటివి ఫ్రెండ్స్‌కు, బంధువులకు షేర్ చేయకండి.
* గూగుల్ ప్లే స్టోర్ తరపున తాము గిఫ్ట్ కార్డ్ ఇస్తామని ఏదైనా సైట్ చెబితే ప్లే స్టోర్‌కు సంబంధించిన అఫీషియల్ సైట్‌ను చూడండి. దానిలో మిమ్మల్ని అప్రోచ్ అవుతున్న సైట్ యాడ్ అయి ఉందో లేదో చూడండి. లేకపోతే అవి ఫేక్ సైట్ అని అర్థం. వాటి జోలికిపోకండి.
* స్పామ్ మెసేజ్‌లను, పిషింగ్ మెయిల్స్‌ను బ్లాక్ చేసే టెక్నాలజీలను వాడండి.
సైబరà±â€Œà°•à±à°°à±ˆà°®à±â€Œ à°—à°¿à°«à±à°Ÿà± కారà±à°¡à±â€Œà°² పేరిట ఆనà±â€Œà°²à±ˆà°¨à± మోసాలౠmalicious gift cards free gift cards scam cyber crime Â