రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా ఫైబర్ టూ ది హోమ్ (FTTH) బ్రాడ్ బ్యాండ్ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చేయనుంది. ఇప్పుడు జియోగిగాఫైబర్ దెబ్బకు ఇతర బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు కూడా తమ డేటా ప్లాన్లలో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ శీర్షికలో భాగంగా రిలయన్స్ జియో ప్రకటించిన డేటా ప్లాన్లతో పాటు ఎయిర్ టెల్, ACT ఫైబర్ నెట్, BSNL భారత్ ఫైబర్, Hathway, స్పెక్ట్రా బ్రాడ్ బ్యాండ్, TataSky బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందించే ప్లాన్ ధరలు, ఆఫర్లు, డేటా స్పీడ్, లిస్ట్ అందిస్తున్నాం. బెస్ట్ ఏదో మీరు సెలక్ట్ చేయండి.
Jio GigaFiber
బేస్ ప్లాన్ స్పీడు 100Mbps నుంచి 1Gbps వరకు ఆఫర్ చేస్తోంది. నెలవారీ ప్రారంభ ధర రూ.700 నుంచి ధర రూ.10వేల వరకు ఉంటుంది. జియో Forever ప్లాన్ తీసుకుంటే HD 4K LED TV, 4K set-top box ఉచితంగా పొందవచ్చు. Freeగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. తక్కువ ధరకే ఇంటర్నేషనల్ కాలింగ్ Traffis. OTT అప్లికేషన్ సబ్ స్ర్కిప్షన్తో ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తోంది. జియో ఫైబర్ కమర్షియల్ సర్వీసులు సెప్టెంబర్ 5, 2019 నుంచి ప్రారంభం కానున్నాయి.
Airtel V-Fiber
100Mbps ఫాస్ట్ స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ఆఫర్ చేస్తోంది. ఢిల్లీలో ఎయిర్ టెల్ నెలవారీ ప్లాన్ ప్రారంభ ధర రూ.799 నుంచి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కింద ఇంటర్నెట్ స్పీడ్ 40Mbps, 100GB బ్రాడ్ బ్యాండ్ డేటా అందిస్తోంది. 100Mbps డేటా ప్లాన్‌పై ధర నెలకు రూ.1,099తో 300GB వరకు Broadband డేటా ఆఫర్ చేస్తోంది. రూ.1,599 ప్లాన్ పై డేటా స్పీడ్ 300Mbps వరకు, రూ.1,999 ప్లాన్ స్పీడ్ 100Mbps వరకు అందిస్తోంది. రూ. 1,999 ప్లాన్‌లో Data Limit ఇవ్వడం లేదు.
BSNL Bharat Fiber
ప్రారంభ ధర నెలవారీగా రూ.777 నుంచి రూ. 16వేల 999 వరకు ఆఫర్ చేస్తోంది. తక్కువ డేటా ప్లాన్ ప్రారంభ ధర రూ.777 ప్లాన్‌పై 50Mbps స్పీడ్ తో 500GB వరకు అందిస్తోంది. డేటా లిమిట్ దాటితే.. డేటా స్పీడ్ 2Mbps కు పడిపోతుంది. 100Mbps డేటా ప్లాన్ ప్రారంభ ధర రూ.1,277తో డేటా లిమిట్ 750GB ఆఫర్ చేస్తోంది. ఖరీదైన డేటా ప్లాన్ రూ.16వేల 999తో 100Mbps బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ రోజుకు 170GB వరకు అందిస్తోంది. డేటా లిమిట్ దాటితే.. 10Mbps స్పీడ్ కు పడిపోతుంది.
Hathway Broadband
సూపర్ థండర్ ప్లాన్ ఢిల్లీలో 150Mbps ప్లాన్‌తో FUPP లిమిట్ 200GB వరకు అందిస్తోంది. హాత్ వే.. Superstrom 100 ప్లాన్ పేరుతో 100Mbps స్పీడ్ అందిస్తోంది. ఈ ప్లాన్‌పై నెలకు FUP లిమిట్ 130GB వరకు అందిస్తోంది.చీపెస్ట్ హాత్ వే ప్లాన్.. రూ.1, 947 ధరకు Strom-15Mbpsతో 3నెలల వరకు అందిస్తోంది. ఈ ప్లాన్ నెలవారీ FUP లిమిట్ 25GB వరకు అందిస్తోంది.
ACT Fibernet
ACT ఫైబర్ ఢిల్లీలో రెండు ప్లాన్లు ఆఫర్ చేస్తోంది. ACT సిల్వర్ ప్రోమో, Act ప్లాటీనం ప్రోమోలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.సిల్వర్ ప్రోమో ప్లాన్ ఆఫర్‌పై రూ.749 ధరకు100Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో 500GB డేటా అందిస్తోంది. ప్లాటీనం ప్రోమో ఆఫర్ కింద రూ.999 ధరకు 150Mbps స్పీడ్‌తో 1,000GB డేటా అఫర్ చేస్తోంది.
Spectra Broadband
స్పెక్ట్రా Broadband ప్రొవైడర్ తమ కస్టమర్లకు నెలకు రూ.885పై 1Gbps స్పీడ్ ఆఫర్ చేస్తోంది.స్పెక్ట్రా ఫాస్టెస్ట్ ప్లాన్ నెలవారీ సబ్ స్ర్కిప్షన్ కింద హైస్పీడ్ డేటా లిమిట్ 500GB వరకు అందిస్తోంది.ఇన్ స్టాలేషన్ లేదా సెక్యూరిటీ ఛార్జీలను 6నెలలు, 12నెలల ప్లాన్లపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.500Mbps స్పెక్ట్రా ఫాస్టర్ ప్లాన్ రూ.833 ధరకే ఆఫర్ చేస్తోంది. రూ.799 చెల్లిస్తే చాలు.. 250Mbps స్పెక్ట్రా ఫాస్ట్ డేటా అందిస్తోంది.
Tata Sky Broadband
డీటీహెచ్ సర్వీసు ప్రొవైడర్, Broadband సర్వీసును అందిస్తోంది. ఫ్రీ రూటర్, డేటా రోల్ ఓవర్, సేఫ్ కస్టడీ ఆప్షన్లతో పాటు 16Mbps స్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది. రూ.700 ప్లాన్ ద్వారా 25Mbps డేటా స్పీడ్ అందిస్తోంది.రూ.800 ప్లాన్ కింద 50Mbps స్పీడ్ ఆఫర్ ఇస్తోంది. టాటా స్కై అందించే రూ.1,100 ధరకు 75Mbps డౌన్లోడ్ స్పీడ్‌తో అన్ లిమిటెడ్ ప్లాన్ అందిస్తోంది. రూ.1,300 ధరకు 100Mbps డౌన్లోడ్ స్పీడ్‌తో అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ఆఫర్ చేస్తోంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ రిలయనà±à°¸à± జియో à°—à°¿à°—à°¾ ఫైబరౠఎయిరà±â€Œà°Ÿà±†à°²à± ఫైబరౠనెటౠయాకà±à°Ÿà± పైబరౠనెటౠటాటా ఫైబరౠనెటà±