సోషల్ మీడియాని ఊపేస్తున్న Number Neighbours గేమ్, అసలేంటిది ?

ఇంటర్నెట్ అనేది అనేక వింతలు విశేషాలకు నిలయం. ఈ మధ్య వైరల్ ట్రెండ్స్ అలాగే కొత్త ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి.  యూజర్లు కొత్త కొత్త ఛాలెంజ్ లను ఇంటర్నెట్లో పెడుతూ అందరికీ సవాల్ విసురుతున్నారు. ఈ కోవలోకే ఇప్పుడు మరో ఛాలెంజ్ వచ్చి చేరింది.  దీనిపేరే number neighbours. ఇది ట్విట్టర్లో మొదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇంతకీ ఈ గేమ్ ఏంటీ,  దీనిని ఎలా ఆడాలి అనే దానిపై ఓ లుక్కేయండి. 

మీరెప్పుడైనా మీ ఫోన్‌ నంబర్‌కు ఒక అంకె ముందు లేదా వెనుక నంబర్‌ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేశారా..? చేసి ఉండరు కదా... దాన్ని తెలుసుకుని వారి రియాక్షన్ ని సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లతో పెట్టడమే ఈ గేమ్.  

‘నైబర్ నంబర్’ పేరుతో ట్రెండ్ అవుతున్న ఈ చాలెంజ్‌లో భాగంగా మన ఫోన్ నంబరుకు ముందు, లేదంటే వెనకున్న నంబరు ఎవరిదో తెలుసుకునేందుకు వారికి మెసేజ్ చేయడం కాని లేకుంటే కాల్స్ చేయడం కాని, ఇతర మార్గాలు ద్వారా తెలుసుకోవాలి. వారి రిప్లయి ని నలుగురితో షేర్ చేసుకోవాలి. 

క్లుప్తంగా చెప్పాలంటే తమ ఫోన్‌ నంబర్‌లోని చివరి అంకెని ఒకటి అటూ లేదా ఇటు మార్చి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడమే ‘నంబర్ నైబర్’ అన్నమాట. నెటిజన్లు ప్రస్తుతం ఈ కొత్త సవాల్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నెటిజన్లు తమ నైబర్ నంబర్లకు మెసేజ్‌ చేసి వారి నుంచి వచ్చిన రిప్లైలను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు.అయితే ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. అవతలి వాళ్లు ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలిసి ఉంటుంది. 

న్యూస్ టెక్నాలజీ మొబైల్స్ నంబర్లు ఛేంజ్ నైబర్ నంబర్ వైరల్ ట్రెండ్స్