సుంద‌ర‌పిచాయ్ ఏడాది జీతంతో మ‌న‌లాంటోళ్లు వంద త‌రాలు బ‌తికేయొచ్చు తెలుసా?

సెర్చ్ ఇంజిన్‌లో ప్రపంచంలోనే నెంబ‌ర్ వ‌న్ గూగుల్‌. దాని మాతృ సంస్థ. దాని సీఈవో సుంద‌ర్‌పిచాయ్‌.  మ‌న భార‌తీయుడు అని గ‌ర్వంగా చెప్పుకుంటాం.. ఇదంతా అంద‌రికీ తెలిసిందేగా మ‌ళ్లీ చెబుతున్నారేమిటా అని విసుక్కోకండి..  గూగుల్‌లో ప‌నిచేసే ఉద్యోగుల‌కే ల‌క్ష‌ల్లో జీతాలు, అల‌వెన్సులు, అన్ని ర‌కాల సౌక‌ర్యాలు ఉంటాయి క‌దా.. మ‌రి దాని  అమ్మ‌లాంటి సంస్థ‌కే బాస్ అయిన మ‌న సుంద‌ర్ పిచాయ్ జీతం ఎన్నికోట్లు ఉంటుందో అని ఎప్పుడైనా అనిపించిందా.. అయితే ఈ ఆర్టిక‌ల్ చ‌ద‌వండి. వామ్మో అనుకోకుండా ఉండ‌లేరు.

రోజుకు 5 కోట్ల 80 ల‌క్ష‌లు
ఆల్ఫాబెట్ సీఈవో అయిన సుంద‌ర్ పిచాయ్‌కు ఆసంస్థ జీత‌భ‌త్యాలు, కంపెనీలో షేర్ల డివిడెండ్లు ఇలాంటివ‌న్నీ క‌లిపి 2019 సంవ‌త్స‌రానికి 281 మిలియ‌న్ డాల‌ర్లు అంద‌జేసింది. ఈ విష‌యాన్ని ఆల్ఫాబెట్ త‌న యాన్యువ‌ల్ రిట‌ర్న్స్‌లో ప్ర‌క‌టించింది. ఇంత‌కూ 281 మిలియ‌న్ డాల‌ర్ల‌ను మ‌న రూపాయ‌ల్లోకి మారిస్తే ఎంతొస్తుందే తెలుసా. జ‌స్ట్ 2,144 కోట్ల రూపాయ‌లు. ఇంకా క‌చ్చితంగా చెప్పాలంటే 2,144,53,58,000 రూపాయ‌ల‌న్న‌మాట‌. రోజుకు 5 కోట్ల 80 ల‌క్ష‌లు

బాధ్య‌త‌లు త‌క్కువేం కాదు
విన‌డానికి సంభ్ర‌మాశ్చ‌ర్యాలు క‌లిగిస్తున్నా ఇది నిజం. ఎందుకంటే ఆల్ఫాబెట్ అలాంటి ఇలాంటి సంస్థ కాదు.. కొత్త ప్రొడ‌క్ట్స్ త‌యారీ, దానిమీద నిత్యం ప‌రిశోధ‌న‌లు, మార్కెట్ వాచ్ చేయ‌డం, పోటీ కంపెనీలు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాయో చూడ‌టం, దానికి త‌గ్గ‌ట్లు ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు మార్చుకోవ‌డం అస‌లు ఆ ప‌ని షెడ్యూల్ త‌ల‌చుకుంటేనే త‌ల‌తిరుగుతుంది.
2 ల‌క్ష‌ల 26వేల 207 కోట్ల రూపాయ‌ల వార్షిక ట‌ర్నోవ‌ర్‌తో, 118,899 మంది అత్యున్న‌త నైపుణ్యం గ‌ల ఉద్యోగులతో ఉన్న ఆల్ఫాబెట్ లాంటి సంస్థ‌ను న‌డ‌ప‌డ‌మంటే మాటలు కాదు.. ఇవ‌న్నీ చూస్తుంటే ఏడాదికి 2,144 కోట్ల రూపాయ‌ల జీతం  మ‌న సుంద‌ర్ పిచాయ్ అవ‌స‌ర‌మే అనిపిస్తుంది కదా.. ఏదేమైనా మ‌న భార‌తీయుడు ఆ స్థాయికి ఎద‌గ‌డం సంతోష‌మేగా.

 

Sundar pichai salary Alphabet CEO Sundar pichai ఆల్ఫాబెట్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌ సుంద‌ర్ పిచాయ్ సుంద‌ర్‌పిచాయ్ జీతం