సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఇన్స్టాగ్రామ్.. ఐజీటీవీ (IGTV) పేరుతో ఓ కొత్త యాప్ను రిలీజ్ చేసింది. గంట వరకు నిడివి గల వీడియోలు అప్లోడ్ చేయడం దీనిలో ప్రత్యేకత. దీనిలో మీ సొంత ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో వీడియోలు అప్లోడ్ చేయొచ్చు.
ఐజీటీవీ ఛానల్ క్రియేట్ చేయాలంటే..
1.ఐజీటీవీ యాప్ ఓపెన్ చేసి లేదంటే ఇన్స్టాగ్రామ్లో నుంచి ఐజీటీవీ సెక్షన్లోకి వెళ్లాలి.
2. యాప్ హోం పేజీలో సెర్చ్ బటన్ తర్వాత ఉన్న టూల్ ఐకాన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక పాప్ మెనూ వస్తుంది. దానిలో Create Channel అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత వచ్చే రెండు పేజీల్లో Next అనేఆ ప్షన్ క్లిక్ చేస్తే Create Channel అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
4. ఇప్పుడు మీ సొంత ఐజీటీవీ ఛానల్ క్రియేట్ అవుతుంది. ఇంతకు ముందు గేర్ ఐకాన్ ఉన్న చోట మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు పోస్ట్ చేసిన వీడియోలన్నీ కనిపిస్తాయి.
5. మీరు కొత్త వీడియోను అప్లోడ్ చేయాలంటే Browse ఆప్షన్ తర్వాత ఉన్న + గుర్తును క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలనుకున్న వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి.
కంప్యూటర్ నుంచి ఐజీటీవీ ఛానల్ క్రియేట్ చేయాలంటే..
మీ పీసీ లేదా ల్యాపీ నుంచి కూడా ఐజీటీవీ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు.
1. పీసీలో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజీ పేజీ ఓపెన్ చేయండి.
2. IGTV ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఆ పేజీలో కింద బ్లూ కలర్లో ఉన్న Get Started బటన్ నొక్కండి.
3. Next నొక్కి తర్వాత రెండు పేజీలకు వెళ్లండి.
4. Create Channel ఆప్షన్ నొక్కితే మీ ఐజీటీవీ ఛానల్ క్రియేట్ అవతుంది. ఇప్పుడు అప్లోడ్ వీడియో బటన్ నొక్కి వీడియో అప్లోడ్ చేయొచ్చు.
కొత్తలో మీ ఐజీటీవీ ఛానల్ ద్వారా 15 సెకన్ల నుంచి 10 నిముషాల్లోపు లెంగ్త్ ఉన్న వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయగలరు. ఇలా కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాక మీరు గంట నిడివి ఉన్న వీడియోలను కూడా అప్లోడ్ చేయొచ్చు. సోషల్ మీడియా ఫ్లాట్ఫాం కాబట్టి మీరు ఎలాంటి వీడియోలనయినా అప్లోడ్ చేయొచ్చు.
create  IGTV Channel upload videos in IGTV  à°à°œà±€à°Ÿà±€à°µà±€ ఛాన‌లౠకà±à°°à°¿à°¯à±‡à°Ÿà± చేయ‌డం. à°à°œà±€à°Ÿà±€à°µà±€ ఛాన‌లà±â€Œà°²à±‹ వీడియోలౠఅపà±â€Œà°²à±‹à°¡à± చేయ‌డం Â