ఫేస్బుక్, ట్విట్టర్లు మన భావాలను పంచుకోవడానికి పనికొస్తున్నాయి. అమెజాన్లో కావాల్సిన వస్తువులు కూర్చున్న చోట నుంచే కొనేసుకుంటున్నాం. జొమాటో యాప్ తెరిస్తే నచ్చిన ఫుడ్ క్షణాల్లో మీ ముందు వాలిపోతుంది. ఇవన్నీ అన్నీ బాగున్నప్పుడు.. మరి వరదలతో అతలాకుతలమైపోయిన కేరళలో ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? మీ ఆనందాన్నే కాదు మీ కష్టాన్ని పంచుకుంటామని ముందుకొచ్చాయి. తమవంతు సాయం చేయడమే తమ సేవలు వాడుకుంటున్న యూజర్లను కూడా కేరళకు సాయం చేయమని అర్ధిస్తున్నాయి.
ఫేస్బుక్ విరాళం కోటీ 75 లక్షలు
సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ కేరళ వరద బాధితుల కోసం 2.50 లక్షల డాలర్లు (కోటీ 75 లక్షల రూపాయల)ను విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని కేరళలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న గూంజ్ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది.
* గూంజ్ (GOONJ) లేదా ముఖ్యమంత్రి సహాయనిధి (CMDRF)కి విరాళాలివ్వాలని ఫేస్బుక్ ఇండియా పేజీ ద్వారా 20 కోట్ల మంది యూజర్లను కోరుతోంది.
* Safety Check featureప్రవేశపెట్టింది. కేరళలోని ఫేస్బుక్ యూజర్లు తాము సురక్షితంగా ఉంటే ఈ ఫీచర్ను వాడొచ్చు.
దేశవిదేశాల్లో ఉన్న వారి బంధుమిత్రులకు ఈ సమాచారం చాలా ఊరటనిస్తుంది.
* అలాగే కేరళలో సహాయ పునరావాస చర్యలకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల నుంచి సేకరించి దాన్ని యూజర్లందరికీ అందుబాటులో ఉంచేందుకు Crisis Response pageని ప్రారంభించింది.
తప్పిపోయినవారిని కనుక్కునేందుకు గూగుల్ పర్సన్ ఫైండర్
కేరళ వరదల్లో గల్లంతయిన వారిని కనుక్కునేందుకు గూగుల్ పర్సన్ ఫైండర్ టూల్ను ప్రవేశపెట్టింది. తప్పిపోయిన వ్యక్తి డిటెయిల్స్ దీనిలో నింపితే అలాంటి పర్సన్ ఎవరికైనా గూగుల్ యూజర్లు గుర్తిస్తే సమాచారం అందులో పోస్ట్ చేస్తారు. ప్రస్తుతం ఇది గూగుల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
* సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేవారికి 10 నుంచి 11 డిజిటల్ కోడ్స్ను గూగుల్ అందిస్తోంది. ప్లస్ కోడ్స్ అని వీటిని పిలుస్తున్నారు. గూగుల్ మ్యాప్లో ఈ కోడ్స్ ఉన్న సహాయ బృందాలు కనిపిస్తుంటాయి. ఆపదలో ఉన్నవారు ఆ కోడ్స్ కనిపించే రిలీఫ్ టీమ్కు దగ్గరగా ఉంటే తామున్న ప్లేస్ను మ్యాప్లో మ్యాగ్జిమం జూమ్ చేసి చూపిస్తే అక్కడికి వచ్చి కాపాడతారు. ఈ కోడ్స్ను మీరు కేరళలో ఉన్న బాధితులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్ చేసి చెప్పొచ్చు. గూగుల్ మ్యాప్స్ సెర్చ్ బాక్స్లో ఈ ప్లస్ కోడ్, వాళ్లున్న ప్రాంతం పేరును బాధితులు టైప్ చేస్తే మ్యాప్లో మీరున్న ప్రాంతాన్ని ఆ రెస్క్యూ టీమ్ కనిపెడుతుంది.
* అలాగే షెల్టర్లు, ఆహారం, మంచినీళ్లు, మందులు, దుప్పట్లు, అంబులెన్స్లు, సహాయబృందాలు ఎక్కడున్నాయో మ్యాప్ మీద పిన్నింగ్ చేసి చూపిస్తోంది.
ఎన్జీవోలతో కలిసి అమెజాన్ సాయం
Oxfam, Goonj, World Vision Indiaకొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అమెజాన్ ఇండియా కేరళ బాధితులకు కావలసిన అత్యవసర సామాన్లను సేకరిస్తోంది. మీరు విరాళంగా ఇవ్వాలనుకున్న వస్తువులను సెలెక్ట్ చేసి అమెజాన్లో వాటికి డబ్బులు చెల్లిస్తే అమెజాన్ కేరళలో బాధితులకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు లేదా రిలీఫ్ క్యాంప్లకు చేరుస్తుంది. వాటిని అక్కడ బాధితులకు అందజేస్తారు. బిగ్బాస్కెట్ కూడా కేరళ బాధితులకు అవసరమైన సామాన్లతో బండిల్స్ ప్యాక్ను రెడీ చేసింది. వీటికి మనం డబ్బులు పే చేస్తే కేరళ బాధితులకు అందిస్తుంది.
పేటీఎం, ట్రూకాలర్ ఫ్లడ్ డొనేషన్ బటన్
పేటీఎం తన హోం పేజీలో కేరళ బాధితులకు యూజర్లు సాయం చేసేందుకు flood donation buttonను తీసుకొచ్చింది. ఇది CMDRF (కేరళ ముఖ్యమంత్రి సహాయనిధి)కి లింకయి ఉంటుంది. మీరు అందులో పే చేసే మనీ డైరెక్ట్గా ఆ అకౌంట్కి వెళుతుంది. మీకు ఈ బటన్ కనపడకపోతే మీ పేటీఎం యాప్ను అప్డేట్ చేయండి. అలాగే ట్రూ కాలర్ కూడా తన ట్రూ కాలర్ పే ద్వారా బాధితులకు సాయం చేయొచ్చు. ఈ అమౌంట్ కూడా CMDRFకి వెళుతుంది.
ట్విట్టర్ హ్యాష్ట్యాగ్స్
#KeralaFloods, #KeralaFloods2018 పేరుతో ట్విట్టర్ హ్యాష్ట్యాగ్లను తీసుకొచ్చింది. ట్విట్టర్ లైట్ యాప్లో కూడా ఈ ట్యాగ్లను వాడొచ్చు. సహాయచర్యలకు, కేరళ బాధితుల్లో ఉన్న ట్విట్టర్ యూజర్లకు సమాచారం పంపుకోవడానికి ఈ ట్యాగ్లు ఉపయోగపడతాయి.
జొమాటో ఫుడ్ డొనేషన్
కేరళ బాధితులకు ఆహారం అందజేసేందుకు జొమాటో.. అక్షయపాత్రతో చేతులు కలిపింది. జొమాటో యాప్లోని Order Food Online సెక్షన్ కింద Help Kerala బ్యానర్ కనిపిస్తుంది. ముగ్గురికి భోజనం అందించాలంటే 90 రూపాయలు, ఆరుగురికి అయితే 180, 10 మందికి అయితే 300 చెల్లించాలి. Kerala Flood Relief అనే బ్యానర్ జొమాటో యాప్లో మీకు కనిపించకపోతే లొకేషన్ను Angamali, Kochi అని మార్చితే వస్తుంది.
Kerala flood victims Facebook Donates Rs. 1.75 Crores for kerala Victims Google Person Finder Plus Codes #KeralaFloods #KeralaFloods2018 Zomato food donation కేరళ బాధితà±à°²â€Œà°•ౠఫేసà±â€Œà°¬à±à°•ౠసాయం కేర‌ళ బాధితà±à°²â€Œà°•à± à°Ÿà±à°µà°¿à°Ÿà±à°Ÿâ€Œà°°à± à°¹à±à°¯à°¾à°·à±â€Œà°Ÿà±à°¯à°¾à°—à±â€Œ జొమాటో à°«à±à°¡à± డొనేష‌నà±Â