ట్రైల‌ర్ అప్‌లోడ్ చేయ‌బోయి సినిమానే అప్‌లోడ్ చేసిన సోనీ కంపెనీ

ఎంతో శ్ర‌మించి, ఎన్నో రోజులు క‌ష్ట‌ప‌డి తీసిన సినిమాకు సంబంధించిన విజువ‌ల్స్ ఎవ‌రో చేసిన చిన్న పొర‌పాటు వ‌ల్ల యూట్యూబ్‌లో వ‌చ్చేస్తున్నాయి. కీల‌క‌మైన సన్నివేశాలు ఏదో ఒక ద‌శ‌లో నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేయ‌డం గురించి వింటూనే ఉంటాం. కానీ తొలిసారిగా ఒక పెద్ద‌ సంస్థే ఇలాంటి పొర‌పాటు చేసింది. తెలిసి చేసిందో.. లేక నిజంగానే తెలియ‌క చేసిందో గానీ సోనీ పిక్చ‌ర్స్ కంపెనీ.. త‌మ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోయి మొత్తం సినిమానే యూట్యూబ్‌లో పెట్టేసి అంద‌రినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

8 గంట‌ల త‌ర్వాత తెలిసింది
జాన్ మాథ్యూస్ ద‌ర్శ‌క‌త్వంలో రిచ‌ర్డ్ కాబ్ర‌ల్ ప్ర‌ధాన పాత్రలో న‌టించిన సినిమా ఖాళీ.. ద కిల్ల‌ర్‌(Khali the Killer). ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను జూలై 3న సోనీ పిక్చ‌ర్స్ యూట్యూబ్ చాన‌ల్‌లో విడుద‌ల చేసింది. అయితే పొర‌పాటున ట్రైల‌ర్‌కు బ‌దులు.. మొత్తం 89 నిమిషాల 46 సెక‌న్లు గ‌ల సినిమాను ఇందులో అప్‌లోడ్ చేసేశారు. అయితే దీనిని ఆ చాన‌ల్‌కు సంబంధించిన వారెవ‌రూ గ‌మ‌నించ‌క‌పోవ‌డం కొస‌మెరుపు. దీనిని CBR.com అనే ఎంట‌ర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ గుర్తించింది. అప్‌లోడ్ చేసిన దాదాపు ఎనిమిది గంట‌ల త‌ర్వాత గానీ.. త‌మ పొర‌పాటును సోనీ కంపెనీ గుర్తించ‌లే క‌పోయింది. అప్ప‌డు తొల‌గించినా.. అప్ప‌టికే చాలా మంది అటెన్ష‌న్‌ను త‌న వైపు తిప్పుకునేలా చేసిందీ సినిమా. ప్ర‌స్తుతం ఈ సినిమాను చూడాల‌నుకునే వారు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. డిజిట‌ల్ రూపంలోనూ అందుబాటులో ఉంది. గ‌త ఏడాది ఇదే సంస్థ‌.. త‌మ సినిమాను డీవీడీ రూపంలో లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే!

 

sony pictures kali the killer youtube trailor film video సోనీ పిక్చర్ యూట్యూబ్ ట్రైలర్ సినిమా కాళీ ది కిల్లర్