సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ మెసెంజర్ అన్‌సెండ్ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. గత గత కొద్ది నెలల కిందట ఫేస్‌బుక్ ఈ ఫీచర్ గురించి ప్రకటించిన విషయం అందరికీ విదితమే. అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజర్‌లో యూజర్లు ఎవరైనా తాము అవతలి వారికి పంపిన మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేయవచ్చు. అయితే అందుకు గాను 10 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ లోపలే మెసేజ్‌ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ లభిస్తున్నది.
మీరు ఈ ఫీచర్ ని చెక్ చేయాలనుకుంటే మీ ఫోన్ లోని మెసేంజర్ యాప్ లో కెళ్లాలి.
మెసేంజర్ నుంచి మీ స్నేహితులకు ఏదైనా ఓ వీడియోని కాని మెసేజ్ కాని పంపండి
ఆ తర్వాత మీరు పంపిన దాన్ని ట్యాప్ చేసి పట్టుకుంటే మీకు అక్కడ రెండు ఆప్సన్స్ కనిపిస్తాయి.
అందులో ఒకటి రిమూవ్ ఫర్ యూ రెండవది రిమూవ్ ఫర్ ఎవిరివన్. ఇందులో మీరు రెండవది క్లిక్ చేస్తే మీరు పంపిన వీడియో అవతలి వారి మెసేంజర్ నుంచి డిలీట్ అవుతుంది.
ఫేసà±à°¬à±à°•ౠమెసెంజరౠయాపà±à°¸à± సోషలౠమీడియా