గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ సైట్‌లో యాడ్స్ రాకుండా వీడియోలను చూసే వెసులుబాటు ఇప్పుడు కల్పిస్తున్నది. అయితే యూజర్లు అలా వీడియోలను చూడాలంటే.. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందాలి. ఈ క్రమంలోనే భారత్‌లో ఇవాళ్టి నుంచే యూట్యూబ్ ప్రీమియం సేవలు ప్రారంభమయ్యాయి. నెలకు రూ.129 చెల్లించి యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ను తీసుకుంటే చాలు.. ఇకపై యూట్యూబ్ లో యూజర్లు చూసే ఏ వీడియోలోనూ యాడ్స్ రావు.
అలాగే యూట్యూబ్‌లో యూట్యూబ్ ఒరిజినల్స్ పేరిట అందుబాటులో ఉన్న ఎక్స్‌క్లూజివ్ వీడియోలను కూడా యూజర్లు వీక్షించవచ్చు. యూట్యూబ్ ప్రీమియం లాంచింగ్ సందర్భంగా మొదటి 3 నెలల పాటు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఆ తరువాత నెలకు రూ.99 చెల్లించాలి. లేదా రూ.149 చెల్లించి ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే 5 మంది కుటుంబ సభ్యులు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలను పొందవచ్చు.
ఇక ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై యూజర్లకు లభిస్తున్నది.ఇక శాంసంగ్ ఈమధ్యే విడుదల చేసిన గెలాక్సీ ఎస్10 ఫోన్‌ను కొనుగొలు చేసిన యూజర్లకు 4 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సేవలు లభిస్తాయి. ఆ తరువాత నెలకు రూ.129 చెల్లించాల్సి ఉంటుంది.ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై యూజర్లకు లభిస్తున్నది.
పూర్తి ప్రీమియం వివరాలు
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మెంబర్‌షిప్- నెలకు రూ.99
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మెంబర్‌షిప్(iOS)- నెలకు రూ.129
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఫ్యామిలీ మెంబర్‌షిప్(ఆరుగురికి)- నెలకు రూ.149
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) మెంబర్‌షిప్(iOS)- నెలకు రూ.199
యూట్యూబ్ ప్రీమియం- నెలకు రూ.129
యూట్యూబ్ ప్రీమియం(iOS)- నెలకు రూ.169
యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) ప్లాన్- నెలకు రూ.189
యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) ప్లాన్(iOS)- నెలకు రూ.249
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ యూటà±à°¯à±‚బౠయాడà±à°¸à± గూగà±à°²à±