వాట్సప్.. ప్రపంచంలోనే కోట్లాది మంది యూజ్ చేసే మెసేజింగ్ యాప్. ఈ యాప్ ఉపయోగించని స్మార్ట్‌ఫోన్ అంటూ ఉండదు. ఎందుకంటే వాట్సప్ వల్ల కేవలం మెసేజింగ్ మాత్రమే కాక చాలా ఉపయోగాలున్నాయి. ఫొటోలు, ఫైల్స్ పంపుకోవడం లాంటి ఎన్నో మనకు అవసరమైన పనులను చేసి పెడుతుంది ఈ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్. అయితే వాట్సప్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతకంటే ఎక్కువ నష్టం కూడా ఉంది. ఎందుకంటే ఈ యాప్‌లో ఏదైనా న్యూస్ పడితే అది వ్యాప్తి చెందానికి కొన్ని నిమిషాలు చాలు. అది మంచి వార్త అయితే ఫర్వాలేదు. కానీ ఫేక్ న్యూస్ అయితేనే ఇబ్బంది. మరి వాట్సప్‌లో ఫేక్ న్యూస్‌ని స్టాప్ చేయడానికి వాట్సప్ ఫాక్ట్ చెకింగ్ సర్వీస్ ఉంది. మరి ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా?
ప్రస్తుతం భారత్‌లో 30 కోట్ల మంది వాట్సప్ వినియోగదారులు ఉన్నారంటే మనం ఆశ్చర్యపోక తప్పదు. న్యూస్‌ను పంచుకోవడానికి, తెలుసుకోవడానికి ఇదో పెద్ద సోర్స్‌గా మారిపోయింది. అయితే మంచి న్యూస్ ఇలా వ్యాప్తి చెందితే ఒకే కానీ వదంతులు.. కలహాలు సృష్టించే విషయాలు వాట్సప్‌లో వ్యాప్తి చెందితే చాలా ప్రమాదం. ముఖ్యంగా మత కల్లోలాలకు కూడా ఇది ఒక కారణం అవుతుంది. అందుకే వాట్సప్ పదే పదే ఈ విషయంలో వినతి చేస్తూనే ఉంది. అలాంటి సున్నితమైన విషయాలను ఫార్వర్డ్ చేయద్దు.. అలాంటి ఫొటోలు, వార్తలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకు రండి. అప్పుడు సోర్స్ నుంచి ఆ ఫొటోలు, వీడియోలను బ్లాక్ చేస్తామని చెబుతోంది. అయినా కూడా ఫేక్ న్యూస్ వస్తూనే ఉన్నాయి, ఇందుకోసం ఫాక్ట్ చెకింగ్ సర్వీస్‌ని యూజ్ చేయాలి.
ఫ్యాక్ట్ చెకింగ్ ఎలా పని చేస్తుంది?
1. మీ కాంటాక్ట్ లిస్టులో 9643000888 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి
2. మీ వాట్సప్‌కు ఏదైనా వెబ్‌సైట్ లింక్ లేదా ఇమేజ్ లేదా టెక్ట్ మెసేజ్ వస్తే మీ కాంటాక్ట్‌లో ఉన్న నంబర్‌కు ఫార్వర్డ్ చేయాలి.
3.ఈ ఆటోమెటెడ్ సర్వీస్... ఆ న్యూస్‌ను చెక్ చేయాలా అని అడుతుంది. అందుకు యాస్ అని టైప్ చేయాలి.
4. ఆ తర్వాత మీకో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఆ న్యూస్ సరైనదా కాదా అనే సమాచారం వస్తుంది. హిందీ, తెలుగు, బెంగాల్, మళయాళంలో ఈ సర్వీసు అందుబాటులో ఉంది.
.
Whatsapp Fact-Checking Service Stop Fake News viral