దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కెమెరా ఫోన్లకు చాలామందే అభిమానులు ఉన్నారు.అలాంటి శాంసంగ్ ఇప్పుడు కొన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారబోతుందా అంటే అవుననే రిపోర్టులు చెబుతున్నాయి. ప్రదర్శనకు ఉంచిన స్టాక్ ఇమేజ్ లను శాంసంగ్ గెలాక్సీ ఎ8 నుంచి తీసామని కంపెనీ చెబుతోంది. గతేడాది డిసెంబర్ లో లాంచ్ అయిన గెలాక్సీ ఎ8 స్టార్ లాంచింగ్ సమయంలో కూడా కొన్ని ఫోటోలను ప్రదర్శనకు ఉంచింది. అయితే ఈ ఫోటోలు ఆ ఫోన్ నుంచి తీసినవి కాదని డిఎస్ఎల్ఆర్ తో తీసిన ఫోటోలని తెలుస్తోంది.
DIY Photography ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎ8 స్టార్ లాంచింగ్ సమయంలో ప్రదర్శనకు ఉంచిన ఫోటోలు DSLR కెమెరాతో తీసారని తెలిపింది. బొకేమోడ్ లో ఉన్న ఇమేజ్ ని బ్యాక్ గ్రౌండ్ మార్చేసి శాంసంగ్ తన ప్రదర్శనకు వాడుకుందని ఓ వ్యక్తి క్లెయిమ్ చేశారు. ఒరిజినల్ చిత్రాన్ని పార్క్ చిత్రం కింద మార్చేసి బ్లర్ ఎఫెక్ట్ తో ప్రదర్శనలో ఉంచారని అతను ఫిర్యాదు చేశారు. ఆ చిత్రం అత్యధిక స్థాయిలో ఎడిట్ అయిందని కళ్లు, స్కిన్ టోన్స్ ని చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు.
గతంలో హువాయి కంపెనీ కూడా తన పీ9 కెమెరా ప్రదర్శనలో ఇతరుల ఇమేజ్ వాడిందని కంప్లయిట్లు వచ్చాయి. ఇప్పుడు శాంసంగ్ కూడా అదే బాటలో నడుస్తోంది. మొత్తానికి స్టాక్ ఇమేజ్ లను తన ఇమేజ్ లుగా చెప్పుకుంటున్న కంపెనీలు తమ పంధాను మార్చుకోవాలని పలువురు కోరుతున్నారు.
శాంసంగౠమొబైలà±à°¸à± ఫోటో కెమెరా à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€