ఏ కాలం లోనైనా అప్పుల అప్పారావు లు ఎక్కువగానే ఉంటారు. అలాగే మీరు కూడా ఎవరో ఒకరికి అప్పు ఇచ్చి ఉంటారు కదా. మరి మీకు బాకీ ఉన్నవాళ్ళను గుర్తు పెట్టుకుని క్రమంగా వారిని మీ బాకీ గురించి అడుగుతున్నారా? ఇకపై అలా గుర్తు ఉంచుకోవలసిన అవసరం లేదు. మీ బాకీ గుర్తు ఉంచుకోవడానికి కూడా ఒక యాప్ వచ్చేసింది. ఇది కేవలం మీకు ఎవరెవరు బాకీ ఉన్నారో గుర్తు ఉంచుకోవడమే కాక మీకు ఆ బాకీ తీసుకున్న వ్యక్తి గురించి రెగ్యులర్ గా గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ యాప్ పేరే OWY యాప్. మీకు ఎంతమంది బాకీ ఉన్నాసరే మీరు ఆ వివరాలను ఈ యాప్ లో యాడ్ చేసుకోవచ్చు. మీకు బాకీ ఉన్న వారి వివరాలు ఇందులో యాడ్ చేయాలి అంటే వారి పేరు, మీరు వారికి అప్పు ఇచ్చిన వస్తువుపేరు, ఇచ్చిన తేదీ తదితర వివరాలను అందులో ఎంటర్ చేస్తే చాలు, మిగతా విషయం ఈ యాప్ చూసుకుంటుంది. మీరు అప్పు ఇచ్చిన వస్తువు యొక్క ఇమేజ్ లను కూడా దీనిని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మరొక ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే మీకు బాకీ ఉన్న వారి లిస్టు ను ఓపెన్ చేసిన వెంటనే వారికి బాకీ చెల్లించవలసిందిగా ఒక మెసేజ్ వెళుతుంది. ఇందులో ఇన్ బిల్ట్ గా మెసేజింగ్ ఫీచర్ ఉండదు. కానీ వాట్స్ అప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ఇది మెసేజ్ ను పంపిస్తుంది. మీ లిస్టు లో ఏదైనా ఒక ఐటెం ను యాడ్ చేసిన ఒక వారం తర్వాత దాని గురించి మీకు రిమైండర్ లను కూడా ఇది పంపిస్తుంది.
దీనిని ఉపయోగించడం ఎలా?
1. ముందుగా ప్లే స్టోర్ నుండి దీనిని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీని ఇంటర్ ఫేస్ చాలా సులువుగా ఉంటుంది. దీనికి ఏ రకమైన సైన్ అప్ ప్రక్రియ అవసరం లేదు.
2. మీరు ఈ యాప్ ను ఓపెన్ చేసినపుడు మెయిన్ స్క్రీన్ క్రింద భాగంలో మీకు ఒక గ్రీన్ బటన్ కనిపిస్తుంది. కొత్త ఐటెం లను యాడ్ చేయడానికి ఈ బటన్ పై ట్యాప్ చేయాలి.
3. మీరు గ్రీన్ బటన్ పై ట్యాప్ చేసినపుడు add new owy అనే స్క్రీన్ కనిపిస్తుంది.అక్కడ మీరు వివరాలు ఎంటర్ చేయాలి.
4. ఇలా మీరు ఎన్ని వస్తువుల వివరాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ లు యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్ గా ఉంటుంది.
5. మీరు యాడ్ చేసిన ఐటమ్ లు అన్నీ మెయిన్ స్క్రీన్ లో ఒక లిస్టు లాగా కనిపిస్తాయి.
6. మెయిన్ స్క్రీన్ లో ఉండే edit owy అనే బటన్ ద్వారా ఆ లిస్టు లో దేన్నైనా ఎడిట్ చేసుకోవచ్చు.
7. వ్యూయింగ్ మరియు ఎడిటింగ్ బటన్ లు కాకుండా సెండ్ మెసేజ్ అనే మరొక బటన్ కూడా ఇక్కడ ఉంటుంది.ఇది మీకు బాకీ ఉన్నవారికి మెసేజ్ లు పంపిస్తుంది.
8. యాప్ సెట్టింగ్ లలో ఉండే రిమైండర్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా వారం తర్వాత మీరు రిమైండర్ లను పొందవచ్చు.