• తాజా వార్తలు

గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ఉపయోగపడే అద్భుత యాప్ లు

మొబైల్ యాప్ లు ప్రస్తుతం మానవ జీవన విధానాలను మార్చి వేశాయి అనడం లో సందేహం లేదు. చిన్న పిల్లల దగ్గర నుండీ పండు ముదుసలి వరకూ అన్ని వయసుల వారికీ ఉపయోగకరమైన యాప్ లు నేడు లభిస్తున్నాయి. ఈ నేపథ్యం లో గర్భిణీ స్త్రీ లకు మరియు బాలింతలకు అవసరమైన యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం. ఈ సమయం లో స్త్రీలు ఇంట్లో నే ఉంటూ తమకు పుట్టబోయే బిడ్డ యొక్క ఆలనా పాలనా ఎలా చూసుకోవాలి? వారిని ఎలా సంరక్షించుకోవాలి అనే అంశాల గురించే ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఈ యాప్ ల వారికి ఎంతో సహాయ పడగలవు.
వైట్ నాయిస్ బేబీ
ఈ యాప్ ద్వారా మీ బేబీ రిలాక్స్ అవుతుంది మరియు ఏడవడం ఆపుతుంది, వీలైనంత ఎక్కువ నిద్ర పోతుంది. జోల పాటను పోలిన సౌండ్ లు ఇందులో ఉంటాయి. ఇవి మీ పాప ను హాయిగా నిద్రపోయేట్లు చేస్తాయి.
మిల్క్ మెయిడ్
మీ పాపకు ఏ ఏ సమయాలలో పాలు ఇవ్వాలి తదితర విషయాలను ఇది మీకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. తద్వారా మీ పాపకు ఆకలి వేసిన వెంటనే మీరు పాలు ఇవ్వడం ద్వారా తన ఆకలిని తీర్చవచ్చు.
షాప్ మాటిక్ గో
స్త్రీ లు అత్యుత్తమ నైపుణ్యాలను కలిగి ఉంటారు అనే కాన్సెప్ట్ పై ఆధార పడి దీనిని రూపొందించారు. అది పెయింటింగ్ కావచ్చు, బకింగ్, డిజైనింగ్, మాక్ అప్ ఆర్టిస్ట్, టీచింగ్, డాన్సింగ్ ఇలా ఏదైనా కావచ్చు. ప్రత్యేకించి ఆడవారు గర్భిణీ గా ఉన్నపుడు ఖాళీ గా ఉంటారు కాబట్టి తమకు తెల్సిన నైపుణ్యాల ద్వారా ఏమేమి చేయవచ్చు, వాటిని ఎలా మార్కెటింగ్ చేయవచ్చు తద్వారా ఎలా సంపాదించవచ్చు తదితర విషయాలన్నీ ఈ యాప్ లో ఉంటాయి.
బిగ్ బాస్కెట్
మీకు కావలసిన నిత్యావసరాల కోసం ఇంట్లో నుండి అడుగు బయటకు పెట్టకుండానే వాటి అన్నింటినీ ఇది మీ దగ్గరకు చేరుస్తుంది. ఇది ఒక ఆన్ లైన్ గ్రాసరీ స్టోర్. మీరు ఇక్కడ మీకు కావాల్సిన వస్తువులను సెలెక్ట్ చేసుకుని మీ ఇంటి అడ్రస్ ఎంటర్ చేసి ఆర్డర్ ఇస్తే చాలు. వీలైనంత తొందరగా అవి మీ ఇంటికి పంపబడతాయి.
బేబీ ఫీడ్ టైమర్
ఇంతకుముందు చెప్పుకున్న యాప్ లో లాగా ఇది కూడా మీరు మీ బేబీ కి ఏ టైం కి పాలు ఇవ్వాలో మీకు గుర్తు చేస్తూ ఉంటుంది, అంతేగాక ఏ ఏ పొజిషన్ లలో మీరు మీ బేబీ కి పాలు ఇవ్వాలి అనే విషయాలను కూడా ఇది మీకు తెలియజేస్తుంది.
వూనిక్
మీరు గర్భిణీగా నారియు బాలింత గా ఉన్న సమయం లో మీకు మరియు మీ పాప కు ఎలాంటి దుస్తులు వాడాలి తదితర విషయాలను ఇది మీకు ఒక కేటలాగ్ రూపం లో అందిస్తుంది. అంతేకాదు అక్కడ షాపింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.

జన రంజకమైన వార్తలు