ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలయ్యి ఇప్పటికే చాలా రోజులు అయింది. చివరి అంకానికి చేరుకుంది. మరొక రెండు మ్యాచ్ లతో ఈ సంవత్సరం సీజన్ ముగుస్తుంది. రేపటి మ్యాచ్ లో విజేతగా నిలిచే టీమ్ తో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఈ ఆదివారం ఫైనల్ అడబోతోంది. ఈ నేపథ్యం లో ఈ ఫైనల్ మ్యాచ్ ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడాలంటే ఆండ్రాయిడ్ లో అందుబాటులో ఉన్న యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో వివరిద్దాం. ఈ యాప్ లను మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఎంచక్కా IPL ఫైనల్ ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎంజాయ్ చేయండి.
హాట్ స్టార్
IPL 2017 ను చూడడానికి ఉన్న ఆప్షన్ లలో హాట్ స్టార్ ఒక ఉత్తమమైన ఎంపిక గా చెప్పుకోవచ్చు. లైవ్ స్కోర్ ను చూడవచ్చు మరియు లైవ్ కామెంటరీ ని వినవచ్చు. అయితే దీనికి కంపాటిబుల్ గా ఉండే ఆండ్రాయిడ్ డివైస్ గురించి ఇంతవరకూ గూగుల్ ఏ విధమైన ప్రకటన చేయనప్పటికీ ఆండ్రాయిడ్ 2.3.2 మరియు తర్వాతి వెర్షన్ లలో ఈ హాట్ స్టార్ అందుబాటులో ఉండనుంది అని తెలుస్తుంది. హాట్ స్టార్ లో లభించే అనేకరకాల మూవీ లు మరియు టీవీ షో లతో పాటు IPL కూడా అలరిస్తుంది. దీని బ్రాడ్ కాస్టింగ్ ఉచితంగానే ఉంటుంది.
సోనీ LIV
IPL ను లైవ్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా అందిస్తున్న యాప్ లలో ఇది మరొక ముఖ్యమైన యాప్. దీని సబ్ స్క్రిప్షన్ కోసం మీరు రూ 49/- లు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ ధర లోమీకు సోనీ నెట్ వర్క్ లోని చానల్ లు అన్నీ చూసే అవకాశం కూడా లభిస్తుంది. ఐపిఎల్ యొక్క అధికారిక బ్రాడ్ కాస్టర్ సెట్ మాక్స్ కాబట్టి ఈ సోనీ లైవ్ యాప్ ద్వారా ఐపిఎల్ ఫైనల్ ఎంచక్కా ఎంజాయ్ చేయండి.
జియో టీవీ
ఈ జియో టీవీ ఒక సరికొత్త యాప్ అయినప్పటికీ ఆండ్రాయిడ్ మొబైల్ లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఐపిఎల్ ను వీక్షించడానికి ఇది ఒక మంచి యాప్ గా చెప్పుకోవచ్చు.ప్రీమియం మొబైల్ లు మాత్రమే గాక 4 జి కనెక్షన్ ఉన్న ఏ మొబైల్ లో అయినా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యాప్ లో మీరు ఐపిఎల్ ను చూడవచ్చు. ఇందులో మీకు అనేక రకాల యాప్ లు ఉచితంగా అందుబాటులో ఉంటాయి కానీ మీరు మీ మొబైల్ లో జియో సిమ్ ను ఇన్ సర్ట్ చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోలేరు.
ఐపిఎల్ అఫీషియల్ యాప్
ఐపిఎల్ యొక్క ఈ అధికారిక యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో లేనప్పటికీ మ్యాచ్ ప్రివ్యూ, లైవ్ స్కోర్ లాంటివాటిని ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ ఐపిఎల్ యొక్క అఫీషియల్ యాప్ ఆండ్రాయిడ్ తో పాటు ఐఒఎస్ లో కూడా అందుబాటులో ఉండనుంది. ఇక కంపాటిబిలిటీ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 4.1 ఆ తర్వాతి వెర్షన్ లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.