• తాజా వార్తలు

మీరు జియో వాడుతున్నారా, అయితే ఈ 5 యాప్స్ మీ దగ్గర తప్పక ఉండాలి

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు ఝళక్ ఇస్తూ వెళుతోంది. మొత్తం టెలికం పరిశ్రమనే జియో మార్చివేసింది. ఇప్పుడు టెలికం పరిశ్రమ గురించి చెప్పాలంటే జియోకు ముందు జియోకు తరువాత అన్ని చెప్పి తీరాలి. చౌక ధర టారిఫ్, డేటా ప్లాన్లు సహా ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యాలతో అత్యంత తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి చేరువైంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కాంప్లిమెంటరీ సేవల కింద ఉచితంగా అందిస్తోంది. దీంతో పాటు కంపెనీ చాలా రకాల యాప్స్ అందిస్తోంది. వీటిల్లో ఐదు యాప్స్‌ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.. 

మైజియో సెల్ఫ్‌కేర్ యాప్: 
ప్రతి జియో యూజర్ ఈ యాప్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. యాప్ ద్వారా నెంబర్‌ను సులభంగా రీచార్జ్ చేసుకోవచ్చు. చాలా పేమెంట్ ఆప్షన్లు ఈ యాప్ లో  అందుబాటులో ఉన్నాయి. డేటా బ్యాలెన్స్, ప్లాన్ వాలిడిటీ, లేటెస్ట్ ఆఫర్లు వంటి పలు సదుపాయాలు కూడా పొందొచ్చు. 

జియో సావన్: 
మ్యూజిక్ స్ట్రీమింగ్, నచ్చిన ఆర్టిస్టుల సాంగ్స్ వినొచ్చు. లిరిక్స్, ప్లేలిస్ట్‌లు వంటి సౌకర్యాలు పొందొచ్చు. వివిధ రకాల భాషలకు చెందిన పాటలు వినొచ్చు. 

జియో టీవీ: 
ఇది లైవ్ టీవీ యాప్. దీనిసాయంతో ఫెవరెట్ టీవీషోలు చూడొచ్చు. అంతేకాకుండా స్పోర్ట్స్ ఛానళ్లు కూడా వస్తాయి. ఇందులో తెలుగు ఛానళ్లు చాలానే ఉన్నాయి. వీటిని హెచ్‌డీ‌లో కూడా చూడొచ్చు. 

జియో సినిమా: 
వీడియో ఆన్ డిమాండ్, ఓటీటీ యాప్స్‌కు పోటీగా రిలయన్స్ జియో ఈ యాప్‌ను లాంచ్ చేసింది. మల్టీపుల్ టీవీ షోలను, సినిమాలు చూడొచ్చు. డక్ ప్లేయర్, వాయిస్ సెర్చ్, వాచ్ లిస్ట్ వంటి ఫీచర్లున్నాయి. జియో టీవీ, జియో సినిమా యాప్స్ కలిగి ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేదు. 

జియో మనీ: 
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన యాప్ ఇది. దీంతో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. డబ్బులు పంపొచ్చు. పొందొచ్చు. బిల్లులు చెల్లించొచ్చు.

జన రంజకమైన వార్తలు