• తాజా వార్తలు

గూగుల్ ట్రాన్స్ లెట్ కంటే మెరుగ్గా ఆల్టర్ నేటివ్స్ చాలా ఉన్నాయి, మీకు తెలుసా?

గూగుల్ ట్రాన్స్ లేషన్ భాషల నుంచి వేరొక భాషలోకి టెక్ట్స్ ను అనువదించవచ్చు. భారతీయ భాషలు అన్నింటికిలోకి అనువదించవచ్చు. కానీ గూగుల్ ట్రాన్స్ లేటర్ కంటే బెస్ట్ ఆల్టర్ నేటివ్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా మీకు కావాల్సిన భాషలోకి అనువదించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం. 

Bing Microsoft Translator...
గూగుల్ ట్రాన్స్ లేషన్ మరియు ఇతర ఆన్ లైన్ టెక్ట్స్ టాన్స్ లేటర్స్ కు...బింగ్ మైక్రోసాఫ్ట్ టాన్స్ లేటర్ గట్టి పోటినిస్తోంది. ఇది ఇన్ పుట్ టెక్ట్స్ మాదిరిగా 5వేల అక్షరాల వరకు ఆటోమెటిగ్గా ట్రాన్స్ లేట్ చేస్తుంది. టెక్ట్స్ ట్రాన్స్ లేషన్ రియల్ టైమ్ లో జరుగుతుంది. ఇది ఒకే క్లిక్ తో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ టెక్ట్స్ కూడా ఇస్తుంది. 
ఇక ఈ టెక్ట్స్ ట్రాన్స్ లేషన్ కు ప్రత్యేక ఫీచర్ ఉంది. మీ వెబ్ పేజీని URLను యాడ్ చేసినట్లయితే...మీరు సెలక్ట్ చేసుకున్న భాషకు మార్చుతుంది. అసలు టెక్ట్స్ ను చూడటానికి ఒక ట్రాన్స్ లెట్ లైన్లో మౌస్ కర్సర్ను ఉంచడానికి అందుబాటులో ఉంటుంది. 
అదనంగా...ఇతర ఆప్షన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఏదైనా ఎడిట్ చేయాలనకుంటే అవుట్ పుట్ టెక్ట్స్ ను కాపీ చేసి...ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో షేర్ చేయవచ్చు. 
Google Docs...
గూగుల్ డాక్స్ ఇన్ లైన్ , అలాగే కంటెంట్ ఎర్రర్ లను మీకు నేరుగా చూపిస్తుంది. మీరు టైపు చేసిన కంటెంట్ లో ఏమైనా గ్రామర్ తప్పులుంటే గూగుల్ ఆటోమేటిగ్గా వాటిని సరిదిద్దుతుంది. అలాగే మీకు అలర్ట్ అందిస్తుంది. గూగుల్ డాక్స్ లో మీరు ఎక్కడైనా ఎర్రర్ చూస్తే దాని మీద వెంటనే రైట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని పదాలు కనిపిస్తాయి. వాటిని యాక్సప్ట్ చేయడం ద్వారా మీరు ఈ గ్రామర్ మిస్టేక్ ల నుండి బయటపడవచ్చ.
Google Translate...
గూగుల్ ట్రాన్స్ లేషన్...ఆన్ లైన్ టెక్ట్స్ ట్రాన్స్ లేషన్ కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. టెక్ట్స్ ట్రాన్స్ లేషన్ కోసం వందల భాసలు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఇన్ పుట్ టెక్ట్స్ ఎంటర్ చేస్తే అది ఆటోమెటిగ్గా భాషను గుర్తిస్తుంది. లేదంటే మీరు ఇన్ పుట్ భాషను సెలక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు గూగుల్ ట్రాన్స్ లేషన్ కు ఒక ప్రత్యేక ఫీచర్ ఉంది. అవుట్ పుట్ టెక్ట్స్ మరియు ఇన్ పుట్ టెక్ట్స్ వినడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని క్లిప్ బోర్డ్ కు కాపీ చేయవచ్చు. ట్రాన్స్ లేషన్ ను ఇమెయిల్ లేదా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. 
ఇది DOCX, PDF, DOC, TXT, RTF, ODF,PPTXలతోపాటు ఇతర ఫార్మాట్ డాక్యుమెంట్లకు ట్రాన్స్ లేషన్ చేయడానికి సపోర్టు చేస్తుంది. 
Systransoft.com...
ఇది చాలా సింపల్ టెక్ట్స్ ట్రాన్స్ లేషన్ ఫీచర్ తో వస్తుంది. దాదాపు 50 భాషల టెక్ట్స్ ట్రాన్స్ లేషన్ కు సపోర్టు చేస్తుంది. అంతేకాదు ఫుల్ టెక్ట్స్ కూడా ట్రాన్స్ లేషన్ చేసుకోవచ్చు. 
ఇన్ పుట్ తోపాటు అవుట్ పుట్ భాషను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. మీరు ట్రాన్స్ లేట్ చేయాలనుకుంటున్న టెక్ట్స్ ను యాడ్ చేయడం లేదా...రాసిని టెక్ట్స్ ను అవుట్ పుట్ పొందడానికి బటన్ను ఉపయోగించండి. ఒకసారి మీరు అవుట్ పుట్ ను కలిగి ఉంటే...దాన్ని సెలక్ట్ చేసుకుని క్లిప్ బోర్డ్ కు కాపీ చేయండి. 
Online-translator.com...
ఇతర టెక్ట్స్ ట్రాన్స్ లేషన్ వెబ్ సైట్లకు...ఇది గట్టి పోటినిస్తోంది. మీరు సైన్ అప్ కాకుండా ఈ వెబ్ సైట్ ను ఉపయోగించుకోవచ్చు. మీరు టెక్ట్స్ ట్రాన్స్ లేషన్ కోసం 3వేల అక్షరాలను యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వెబ్ సైట్ కు సైన్ అప్ అయినట్లయితే దాదాపు ఒకే సమయంలో 10వేల అక్షరాలను ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. 
ఇది ఆటోమెటిగ్గా ఇన్ పుట్ టెక్ట్స్ ను గుర్తించి ఇన్ పుట్ భాషను కూడా మ్యానువల్ గా సెట్ చేసుకోవచ్చు. 
Translator.eu...
టెక్ట్స్ ఇంటర్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర భాషలకు టెక్ట్స్ ను ట్రాన్స్ లేట్ చేయడానికి దాదాపు 40 భాషలకు పైగా సపోర్ట్ చేస్తుంది. వెబ్ సైట్ కూడా ట్రాన్స్ లేట్ కు రేటింగ్ అవకాశం ఇవ్వడానికి సహాయపడుతుంది. 
Collins Free Online Translator...
ఇది ఫ్రీ ఆన్ లైన్ ట్రాన్స్ లేటర్. దీన్ని మీరు కూడా ప్రయత్నించవచ్చు. ట్రాన్స్ లేషన్ కోసం 30భాషలకు పైగా అందుబాటులో ఉన్నాయి. ఈ సైట్ ఇంటర్ స్పేస్ లో రెండు బాక్సులు ఉన్నాయి. ఇన్ పుట్ టెక్ట్స్ మరియు అవుట్ పుట్. ఇది భాషలను సెట్ చేస్తుంది. ఇన్ పుట్ టెక్ట్స్ ను యాడ్ చేస్తుంది. ఇన్ పుట్ టెక్ట్స్ కోసం 5వేల అక్షరాలకు సపోర్ట్ చేస్తుంది. 
Free Translation Online...
ఫ్రీ ట్రాన్స్ లేషన్ ఆన్ లైన్...ఇది మాములు ఇంటర్ స్పేస్ ను కలిగి ఉంటుంది. కానీ ట్రాన్స్ లేషన్ టెక్ట్స్ చాలా బాగుంటుంది. ఇన్ పుట్, అవుట్ పుట్ భాషలను సెలక్ట్ చేసుకోవచ్చు. 
ఇక స్పెల్ చెకర్ కూడా ఉంది కానీ ఇది అంతగా ఉపయోగపడదు. ట్రాన్స్ లేషన్, మాట్లాడటం, ఇన్ పుట్ టెక్ట్స్ కు ఒక ఆప్షన్ ఉంది. కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కోసం కొన్ని యాడ్ ఆన్ ఇన్స్ స్టాల్ చేయమని అడుగుతుంది. 

జన రంజకమైన వార్తలు