మనలో చాలా మందికి రోజుకి కొన్ని వందల ఈ మెయిల్ లు వస్తూ ఉంటాయి. అయితే వాటి అన్నింటినీ ఓపెన్ చేసి చదివే తీరిక ఎవరికి ఉంటుంది? ఒకవేళ ఉన్నా ఎన్ని మెయిల్ లు చూడగలరు. మనకు వచ్చిన మెయిల్ లో అతి ముఖ్యమైనవి ఉండవచ్చు. వాటిని చూడకుండా ఉంటె ఏదైనా నష్టం సంభవించవచ్చు. మరి ఎలా? మనకు వచ్చిన ఈ మెయిల్ లలో అతి ముఖ్యమైనవి ఏవో తెలుసుకోవడం ఎలా ? అన్ని వందల మెయిల్ లలో మనకు కావలసినవి ఫిల్టర్ చేసుకోవడం సాధ్యం అయ్యే పనేనా? ఖచ్చితంగా అవుతుంది. ఇలా ఈ మెయిల్ లను ఆర్గనైజ్ చేయడానికి ఫిల్టర్ లు అనే టూల్ లు ఉంటాయి. వీటిద్వారా మీరు మీ ఈ మెయిల్ లను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సమస్యలను చిటికెలో అతి సులువుగా పరుష్కరించడానికి ఒక సరి కొత్త యాప్ వచ్చేసింది. అది ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించుకుంటుంది. దీనినే ఆస్ట్రో అని పిలుస్తున్నారు.
ఇప్పటికే ఉన్న ఇన్ బాక్స్ జీరో యాప్ లు అందించే ఫీచర్ లానే దాదాపుగా ఈ యాప్ కూడా అందిస్తుంది. మీకు ముఖ్యమైన వ్యక్తుల నుండి వచ్చే ఈ మెయిల్ లను ఇది ముందు చూపిస్తుంది అలాగే అవసరం లేదు అనుకున్న వాటిని మ్యూట్ చేస్తుంది. అత్యంత ముఖ్యమైన వారిని ఒక ప్రాధాన్యతా క్రమం లో ఉంచుతుంది. అంటే ఇది పైన ఒక ప్రయారిటీ ఇన్ బాక్స్ ను సెట్ చేస్తుంది. ఇలా ప్రయారిటీ ఇన్ బాక్స్ ను తయారు చేసే ఫీచర్ దీనిని మిగతా యాప్ లకు భిన్నంగా నిలబెడుతుంది.
అలాగే మీరు రెగ్యులర్ గా ఎవరితోనైతే చాటింగ్ చేస్తున్నారో వారిని ఆటోమాటిక్ గా ఇది ప్రయారిటీ బేస్ లో సెట్ చేస్తుంది. ఇదంతా ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ద్వారా జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదాహరణకు మీరు మీ ఫ్రెండ్ తో చాటింగ్ లో ఏదైనా ముఖ్యమైన ఈవెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారనుకోండి. ఆ ఈవెంట్ దగ్గరకు వచ్చే సమయానికి ఇది మీకు రిమైండ్ చేస్తుంది.
మీరు ఎప్పుడూ మీ ఈ మెయిల్ సెట్టింగ్ లను మార్చుతూ ఉంటారా? ఆస్ట్రో తన ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ద్వారా మీ సెట్టింగ్ లను మరింత వేగవంతంగా మార్చుకునేవిధంగా మీకు సహాయం చేస్తుంది.దీనికి సంబందించిన బటన్ మీ మొబైల్ యాప్ లో ఇన్ బాక్స్ పక్కనే ఉంటుంది. అంతేగాక ఇది మన ప్రణాళిక లను కూడా సెట్ చేస్తుంది. మీరు పంపిన ఈ మెయిల్ ను ఎవరు ఓపెన్ చేసారో కూడా మీకు ఇది తెలియజేస్తుంది. మీరు తరవాత రాద్దాం లే అనుకున్న ఈ మెయిల్ లకు మీకు షెడ్యూల్ ను సెట్ చేస్తుంది.
ఇది ప్రస్తుతానికి ప్రారంభ దశ మాత్రమే అని దీని ఫౌండర్ లు చెబుతున్నారు.దాదాపు అన్ని ఫ్లాట్ ఫాం లపై దీనిని తీసుకురావడమే తమ లక్ష్యమని వీరు చెబుతున్నారు. ప్రస్తుతనికిదీని బీటా వెర్షన్ మాక్ మరియు ఐఒఎస్ లలో లభిస్తుంది. రెండు రోజుల క్రితం ఆండ్రాయిడ్ వెర్షన్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. దీనికి ఆండ్రాయిడ్ వేర్ మరియు కిండల్ ఫైర్ లు సపోర్ట్ చేస్తాయి. వాయిస్ ను కూడా ఇంటిగ్రేట్ చేయడానికి అలెక్సా యాప్ ను కూడా ఇది భవిష్యత్ లో తీసుకురానున్నట్లు చెబుతుంది. ఈ సర్వీస్ ప్రస్తుతానికి జి మెయిల్ మరియు ఆఫీస్ 365 లను సపోర్ట్ చేస్తుంది.