అద్దెకు ఇల్లు వెతకడం అంటే చాలా పెద్ద పని....అందులో వేసవికాలంలో అయితే మరి కష్టం. అందుకే పెద్దగా కష్టపడకుండా సింపుల్ గా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈజీగా మీరు కోరుకున్నట్లుగా ఉండే అద్దెతోపాటు...మీకు కావాల్సిన అపార్ట్ మెంట్లలోనే అద్దె ఇంటిని తీసుకోవచ్చు. అద్దెకు అపార్ట్ మెంట్లు వెతకడానికి కూడా సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. ఈ నాలుగు సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీకు కావాల్సిన అపార్ట్ మెంట్ ను వెతుక్కొండి.
1.Apartments.com
నగరంలో అద్దెకు అపార్ట్ మెంట్లను వెతకడానికి ఒక బెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఇది. ఈ సెర్చ్ ఇంజిన్ ఒక మంచి ఇంటర్ స్పేస్ ను కలిగి ఉండటంతో అపార్ట్ మెంట్లను సెర్చ్ చేయడం చాలా సులభం. మీరు ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే...పైన స్క్రీన్లో ఇంటర్ స్పేస్ కనిపిస్తుంది. మీరు సెర్చ్ చేసినవాటిని సేవ్ చేయడానికి వెబ్ సైట్ తో సైన్ అప్ చేసి, ఒక అకౌంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. సెర్చ్ బాగ్స్ పై భాగంలో మీరు అపార్ట్ మెంట్లు, ఇండ్లు లేదా టౌన్ హోంలకు కావల్సిన ఆప్షన్ ఉంటుంది. మీకు కావాల్సిన ఆప్షన్ సెలక్ట్ చేసుకోవచ్చు. అపార్ట్ మెంట్ ను సెలక్ట్ చేసుకున్నట్లయితే...అద్దె తోపాటు, మీకు కావాల్సిన రూమ్స్, బాత్ రూమ్స్ ఎన్ని ఉండాలనేది కూడా ఆప్షన్ ఉంటుంది సెలక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన వాటిని సెలక్ట్ చేసుకున్నాక గో బటన్ పై క్లిక్ చేయండి. మీరు సెర్చ్ చేసిన రిజల్ట్ కనిపిస్తుంది.
కాగా స్క్రీన్ ఎడమ వైపు మీరు ఎంటర్ చేసిన ప్లేస్ లోనే...ఒక మ్యాప్ ఉంటుంది. అద్దెకు అందుబాటులో ఉన్న అన్ని అపార్ట్ మెంట్లకు సంబంధించి పిన్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. రైట్ సైడ్ పేరు, అడ్రస్, రెంట్, ఇమెజ్ వంటి వివరాలు ఉంటాయి. అపార్ట్ మెంట్ల గురించిన సమాచారం రియలర్ల నుంచి సేకరిస్తారు. అంతేకాదు రియల్టర్ పేరు కూడా రైట్ సైడ్ లో ఉంటుంది.
2.Rent Jungle...
అద్దెకు అపార్ట్ మెంట్స్ వెతుకుతున్నవారికి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే...స్క్రీన్ పై చూపిన ఒక ఇంటర్ స్పేస్ కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్ లో...మీరు ఏ నగరంలో అద్దెకు తీసుకోవాలనుకుంటున్నరో ఎంటర్ చేయాలి. తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. సెర్చ్ ఫలితాలు స్క్రీన్ షాట్ రూపంలో కనిపిస్తాయి.
రిజల్ట్స్ రెండు పార్ట్స్ ల్లో మీరు చూడొచ్చు. స్క్రీన్ కుడివైపు ఉన్న అపార్ట్ మెంట్ లొకేషన్లను చూపించే మ్యాప్, ఎడమ వైపు అపార్ట్ మెంట్లు ఉంటాయి. ఇతర వెబ్ సైట్ల నుంచి అపార్ట్ మెంట్ల లిస్టు సేకరిస్తారు. అపార్ట్ మెంట్ పేరు, అడ్రెస్, రెంట్ మొత్తం, ఇతర సౌకర్యాలు వంటి ఈ కనిపిస్తాయి. మీరు అపార్ట్ మెంట్ లిస్టుపై క్లిక్ చేసిప్పుడు, దానికి సంబంధించిన ఇమేజ్ లతోపాటు పూర్తి వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
3.Move
ఇది ఇతర వెబ్ సైట్ల నుంచి మీకు కావాల్సిన ఫలితాలను అందించడంలో సహాయపడుతుంది. ఇది ఒక సెర్చ్ ఇంజిన్. వెబ్ సైట్ గురించి సెర్చ్ ఫంక్షన్ డోర్ స్టెప్స్ పై ఆధారపడి ఉంటుంది. వెబ్ సైట్ ఇంటర్ స్పేస్ పై స్క్రీన్ షాట్లు కనిపిస్తాయి. ఇక్కడ మీరు మీకు కావాల్సిన నగరంలో అపార్ట్ మెంట్ వెతకడానికి ఎంటర్ కావచ్చు. మీకు కావాల్సింది వెతకడానికి సెర్చ్ బటన్ను నొక్కండి. సెర్చ్ రిజల్ట్స్ పేజీ కింది భాగంలో స్క్రీన్ షాట్లో కనిపిస్తాయి.
4.Rent.com
అద్దెకు అపార్ట్ మెంట్స్ వెతికేవారికి ఇది బెస్ట్ వెబ్ సైట్. మిగతా వెబ్ సైట్ల కంటే మెరుగైన ఫలితాలను అందిస్తుంది. వెబ్ సైట్ ఇంటర్ స్పేస్ యూజర్ ఫ్రెండ్లీతోపాటు నావిగేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు వెబ్ సైట్ ఓపెన్ చేయగానే...రెంటర్ ప్రాపర్టీ లేదా ఇల్లు వంటి వాటని సెలక్ట్ చేసుకోవచ్చు. మీరు సెర్చ్ చేస్తుంటే మీకు కావాల్సిన రిజల్ట్స్ స్క్రీన్ లో కనిపిస్తాయి.
ఈ పేజీలో రైట్ సైడ్ పిన్స్ తో ఒక మ్యాప్ కనిపిస్తుంది. రెంటల్ ప్రాపర్టీకి సంబంధించిన లిస్టు ఉంటుంది. వెబ్ సైట్ లెఫ్ట్ సైడ్ లో మీరు సెర్చ్ చేసిన ప్రాపర్టీలు కనిపిస్తాయి. పేరు, అడ్రెస్, అద్దె వంటి జాబితా ఉంటుంది. మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే...పూర్తి స్క్రీన్లో కనిపిస్తుంది.