• తాజా వార్తలు

మీ ఆన్ లైన్ అకౌంట్ ని వేగంగా నిర్మూలించే యాప్ డీసీట్ మీ

ఇంటర్నెట్ వినియోగిస్తున్న సమయంలో మనకు తెలియకుండానే నిత్యం ఎన్నో కొత్త సైట్లలో ఖాతాలు తెరిచేస్తుంటాం. నేరుగా రిజిష్టర్ చేసుకోకపోయినా ఫేస్ బుక్, జీమెయిల్ లాగిన్ల ద్వారా అయినా అందులో మన అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అప్పటికి ఉన్న అవసరం మేరకు అలా చేసినా ఆ తరువాత దాన్ని మర్చిపోతే. ఒక సగటు ఇంటర్నెట్ వాడకం దారు వారానికి ఇలా కనీసం 5 అకౌంట్లు ఓపెన్ చేస్తాడట. కానీ.... అవసరం లేని ఇలాంటి ఖాతాలను తొలగించాలంటే ఏది ఎప్పుడు ఎందులో క్రియేట్ చేశామో తెలియక సాధ్యం కాదు. కానీ... ఇందుకు ఒక మార్గం ఉంది. డీసీట్.మీ(deseat.me) యాప్ సహాయంతో ఆ పని పూర్తి చేయొచ్చు.
ఈమెయిల్ కనెక్ట్ చేస్తే చాలా ఫుల్ లిస్టు వచ్చేస్తుంది
ఏమాత్రం అవసరం లేని ఖాతాలను తొలగించడానికి... క్లోజ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ యాప్. డీసీట్ మీ వెబ్ యాప్ కు మన ఈమెయిల్ ను కనెక్ట్ చేసింది మొదలు ఇది మనం దేని దేనిలో ప్రొఫైల్స్ క్రియేట్ చేశామో చూపించేస్తుంది.
తొలగించడం ఎలా..
డీసీట్ మీ మొత్తం జాబితా చూపిస్తుంది. అందులో మనకు కావాల్సినవి సెలక్ట్ చేసుకుని మిగతావన్నీ రిమోవ్ చేసేయాలి.
లాగిన్ డీటెయిల్స్ తెలిసిపోతాయన్న భయం లేదు..
నిజానికి మన ఆన్ లైన్ ఖాతాలకు సంబంధించిన సమాచారం చూపిస్తుంది కాబట్టి చాలామందిలో ఓ భయం ఉంటుంది. ఏమీ లేని ఫేస్ బుక్ ఓపెన్ చేస్తేనే మన లొకేషన్, కెమేరా, మెసేజింగ్ యాప్స్ వంటివన్నీ యాక్సెస్ చేసి మొత్తం సమాచారం దోచేస్తుంది కదా, మరి ఇలాంటి అకౌంట్ డిటెక్షన్ యాప్ అయితే, అది మన లాగిన్ డీటెయిల్స్ సంపాదిస్తే ఎలా ? డేంజర్ కదా అన్న భయం చాలామందిలో ఉంది. కానీ, అలాంటి భయం అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఓథ్ 2.0 ప్రోటోకాల్ ఉంటుంది. మనకున్న అకౌంట్లు , అందులో ఏం డిలీట్ చేయమంటున్నాం అన్న వివరాలే ఇది తెలుసుకుంటుంది. లాగిన్ డీటెయిల్స్ జోలికి పోదు. సో... వెరీ వెరీ సేఫ్ యాప్ ఇది.

జన రంజకమైన వార్తలు