• తాజా వార్తలు

మీ ఫోన్లో ఫొటోలు, వీడియోలు ఇంకెవరూ చూడకుండా చేయాలనుకుంటున్నారా... ఇది ట్రై చేయండి

స్మార్టు ఫోన్ అన్నాక సమస్తం అందులోనే సేవ్ చేస్తుంటాం.. ఒక్కోసారి ఇతరులు చూడకూడని ఫొటోలు, వీడియోలు కూడా మన ఫోన్లో ఉంటాయి. కానీ, వాటిని ఇతరులు చూడకుండా ఎలా దాచుకోవాలో చాలామందికి తెలియదు. అలాంటప్పుడు పాపం మనసు చంపుకుని వాటిని డిలీట్ చేసేస్తుంటారు. కానీ... అలా డిలీట్ చేయాల్సిన అవసరమే లేదు. వాటిని హైడ్ చేయడానికి సరికొత్త యాప్ ఒకటి వచ్చేసింది.
గ్యాలరీని బీరువాలో పెట్టేయొచ్చు
    ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్టు డివైస్ లలోని గ్యాలరీ ఫైళ్లను హైడ్ చేయడం కోసం 'హైడ్ పిక్చర్స్ గ్యాలరీ వాల్ట్ పేరిట ఓ కొత్త యాప్ తాజాగా విడుదలైంది. ఈ యాప్‌ను యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 3.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. 
పాస్ వర్డ్, ప్యాట్రన్, పిన్, ఫింగర్ ప్రింట్ ప్రొటెక్షన్
    దీని సహాయంతో తమ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను సులభంగా హైడ్ చేసుకోవచ్చు. యాప్‌లో పిన్, ప్యాట్రన్, పాస్‌వర్డ్ లేదా ఫింగర్‌ప్రింట్ లాక్‌ను సెట్ చేసుకుంటే చాలు, వాటితో డివైస్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను ఈ యాప్‌లో ఉన్న వాల్ట్‌లోకి పంపవచ్చు. దీంతో అవి లాక్ అవుతాయి. మళ్లీ పిన్, ప్యాట్రన్, ఫింగర్‌ప్రింట్ వంటివి ఉంటేనే అది అన్‌లాక్ అవుతుంది. అప్పుడే ఫొటోలు, వీడియోలను చూడగలుగుతారు. లేదంటే ఎవరూ డివైస్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను చూడలేరు. 
వీడియో ప్లేయర్ ఆప్షన్
    దీంతోపాటు వీడియో ప్లేయర్ అనే టూల్ కూడా ఈ యాప్‌లో ఉంది. దీంతో వాల్ట్‌లో ఉన్న వీడియోలను ప్లే చేసుకోవచ్చు. యాప్ లాక్ సహాయంతో యూజర్లు తాము కావాలనుకున్న యాప్‌లకు లాక్ వేసుకోవచ్చు. ఇక వాటిని యూజర్ తప్ప ఎవరూ ఓపెన్ చేయలేరు. మొత్తానికి మనం తప్ప ఇంకెవరూ చూడకుండా ఉంటే అంతకంటే సేఫ్ ఇంకేమీ ఉండదు కదా. ఇంకెందుకాలస్యం డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి.
 

జన రంజకమైన వార్తలు