సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ గురించి యూజర్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రొఫెషనల్ సైట్ కూడా పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు అవసరం భావిస్తోంది. దీనిలో భాగంగా ఆ సంస్థ భారత్‌లో లింక్డ్ ఇన్ మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. లింక్డ్ ఇన్ లైట్ పేరుతో విడుదలైన ఈ యాప్ వినియోగదారులకు ఉపయోగించుకోవడానికి సులభంగా ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. మొబైల్‌లో లింక్డ్ ఇన్ వాడేటప్పుడు డేటాతో ఎదురయ్యే ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి, వేగంగా యాక్సిస్ కావడడానికి తాజాగా విడుదల చేసిన లైట్ వెర్షన్ ఉపయోగపడుతుందనేది లింక్డ్ ఇన్ మాట.
1 ఎంబీ సైజుతో..
లింక్డ్ ఇన్ తాజాగా తయారు చేసిన లింక్డ్ ఇన్ లైట్ 1 ఎంబీ సైజుతో ఉంటుంది. త్వరలోనే 60 దేశాల్లో ఈ యాప్‌ను విడుదల చేయడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. లో ఎండ్ ప్లాన్స్‌ను ఉపయోగించే స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ఈ తాజా లైట్ వెర్షన్‌ను తయారు చేసినట్లు లింక్డ్ ఇన్ చెప్పింది. స్లో నెట్‌వర్క్ కనెక్టివీటీ ఉన్న మొబైల్ ఫోన్లకు కూడా లింక్డ్ ఇన్ తాజా వెర్షన్ అద్భుతంగా ఉపయోగపడుతుందట. లైట్ వెర్షన్ 80 శాతం డేటా యూసేజ్‌ను తగ్గించి, ఐదు సెకన్లలోపే పేజీలను లోడ్ చేస్తుంది.
500 మిలియన్ల యూజర్లు
లింక్డ్ ఇన్ వాడే యూజర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి లింక్డ్ ఇన్ ఉపయోగించే వాళ్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్లు క్రాస్ అయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. వీరిలో 42 మిలియన్ల మంది భారత యూజర్లు ఉన్నారు. వీళ్లందరిని దృష్టిలో ఉంచుకుని .. కొత్త లైట్ వెర్షన్‌ను తెచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఒరిజినల్ లింక్డ్ ఇన్ యాప్‌లో ఉన్నట్లుగానే ఇందులోనే ఫీడ్, ప్రొఫైల్, జాబ్స్, మెసేజింగ్, సెర్చ్, నోటిఫికేషన్స్ లాంటి ఫీచర్లు ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. ఆండ్రాయిడ్‌తో పాటు త్వరలోనే ఐఓఎస్ వెర్షన్లలో కూడా లభ్యం అవుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లను దెబ్బ కొట్టడానికి త్వరలోనే లింక్డ్ ఇన్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుందట. దీనిలో భాగంగా వీడియోలు మనం పోస్ట్ చేయచ్చు. వాటిని ఎవరు చూశారో, ఎన్ని లైక్స్, షేర్స్ వచ్చాయో.. ఈ వివరాలన్నిటిని లింక్డ్ ఇన్ ఇవ్వనుంది.