• తాజా వార్తలు

ఈ యాప్స్ ఉంటే మైక్రో స్టేకు అవకాశం

వ్యాపారం ఆన్ లైన్ వేదికల్లోకి వచ్చేసిన తరువాత సరికొత్త ఆలోచనలు, సవాలక్ష మార్గాలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో వ్యాపారులు, వినియోగదారులకు కూడా సులభంగా ఉండేలా కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి.తాజాగా ఆథిథ్య రంగంలో అలాంటి ఒరవడే మొదలవుతోంది. అది పక్కాగా అమలు కావడానికి సాంకేతికత సాయపడుతోంది. టెక్నాలజీ అండగా స్టార్టప్ లు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఒకప్పుడు హోటల్ గది బుక్ చేయాలంటే 12 గంటలు, లేదంటే రోజంతటికీ డబ్బు చెల్లించి తీసుకోవాల్సి వచ్చేది. ఉండేది ఒకట్రెండు గంటలైనా కూడా మొత్తం కాలానికి పే చేయాల్సి వచ్చేది. పలు ఆన్ లైన్ హోటల్ రూం బుకింగ్ వెబ్ సైట్ల పుణ్యమా అని ఇప్పుడు అవర్లీ బేసిస్ పై గదులు బుక్ చేయడానికి వీలవుతోంది.
ఎంతసేపు ఉంటే అంతే బిల్లు కట్టేలా పక్కా లెక్కలు వేసే కాలిక్యులేటర్లు ఆ యాప్ లోనే ఇన్ బిల్ట్ గా ఉంటున్నాయి. కొత్త వెసులుబాటు ప్రకారం హోటల్లోకి అడుగుపెట్టేందుకు 12 గంటల దాకా ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణం సాయంత్రమైతే ఉదయం 11 గంటలకే ఖాళీచేసి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీ సమయానికి అనుకూలంగా స్లాట్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు.
ఇలా గంటల ప్రాతిపదిక హోటల్ స్లాట్స్ బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్న సైట్లు, యాప్స్ ఆదరణ పొందుతున్నాయి.
www.6hourly.com
https://stayuncle.com/
http://www.mistay.in/
www.chaturmusafir.com
వంటి వెబ్ సైట్లు, వీటి యాప్ లు ఇలాంటి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ సదుపాయం వల్ల ప్రయాణంలో ఉండగానే.. వెళ్లాల్సిన నగరంలోని హోటల్లో దిగి ఫ్రెష్ అయి వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం కల్పిస్తున్న హోటళ్లను ట్రాన్సిట్ హోటల్స్ అని... ఈ విధానాన్ని మైక్రో స్టే అని అంటున్నారు.

జన రంజకమైన వార్తలు