• తాజా వార్తలు

ఇక నుంచి ఈ యాపిల్ యాప్స్ ఫ్రీ


ఎక్కువ మంది ఆండ్రాయిడ్ మొబైల్స్ ను ప్రిఫర్ చేయడానికి గల ప్రధాన కారణాల్లో విస్తారంగా దొరికే ఉచిత యాప్స్. యాపిల్ ఫోన్లకు ఎంత క్రేజ్ ఉన్నా కూడా చాలామంది వెనుకాడడానికి ఇలా ఉచిత యాప్స్ ఎన్ని కావాలంటే అన్ని దొరక్కపోవడమూ ఒక కారణమే. అయితే.... స్మార్టు ఫోన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ లా కమ్మేయాలన్న ఉద్దేశంతో యాపిల్ కూడా మెల్లమెల్లగా టర్ను తీసుకుంటోంది. ఒకప్పటి కంటే చాలా ఫ్లక్సిబుల్ గా ఉంటోంది. తరచూ తన యాప్స్ ను ఉచితంగా ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తాజాగా ఓ మూడ ఐఫోన్ యాప్స్ ను ఉచితంగా మార్చేసింది.
ఏమిటవి...
యాపిల్ సొంత యాప్స్ లో బాగా పాపులర్ అయిన యాప్స్ లో ఐ మూవీస్ ఒకటి. ఇప్పటివరకు అది డౌన్లోడ్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. కానీ... ఇక నుంచి అది పూర్తి ఉచితం. అలాగే, గ్యారేజి బ్యాండ్, ఐవర్క్ సూట్ యాప్స్ కూడా ఫ్రీగానే దొరకననున్నాయి. వీటిని కూడా ఐస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మూడు యాప్స్ ను ఐఓఎస్, మ్యాక్ ఓఎస్ రెండింటికీ వీటిని ఉచితంగానే అందించనుంది.
ఇంతకుముందు ధరలు
ఇంతకుముందు ఐవర్క్ సూట్ యాప్ మ్యాక్ వెర్షన్ ధర 20 డాలర్లు ఉండేది. ఐఓఎస్ కోసమైతే 10 డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఐ మూవీస్ యాప్ మ్యాక్ వెర్షన్ 15 డాలర్లు... ఐఓఎస్ వెర్షన్ 5 డాలర్లు ఉడేది. గ్యారేజి బ్యాండ్ యాప్స్ రెండు వెర్షన్లూ 5 డాలర్లకు దొరికేవి.
64 బిట్ కు మారిపోతోంది...
యాపిల్ మెల్లమెల్లగా 64 బిట్ ఎకో సిస్టమ్ ను అడాప్టు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ వినియోగదారులు, డెవలపర్లను కూడా 32 బిట్ నుంచి 64 బిట్ కు మారాలంటూ పదేపదే కోరుతోంది. ఈ ఏడాది ఐఓఎస్ 11 లాంఛ్ చేసిన తరువాత 32 బిట్ యాప్స్ కు సపోర్టు ఇవ్వడం పూర్తిగా ఆపేయబోతున్నట్లు తెలుస్తోంది.

జన రంజకమైన వార్తలు