• తాజా వార్తలు

ఏమిటీ టిక్‌టాక్ డివైజ్ మేనేజ్‌మెంట్‌?

ఇప్పుడు ఎక్క‌డ చూసినా టిక్‌టాక్ హ‌వానే న‌డుస్తుంది. చిన్న పిల్లల నుంచి ముస‌లి వాళ్ల వ‌ర‌కు టిక్ టాక్ మాయ‌లో ప‌డిపోయారు. కొత్త కొత్త వీడియోలు చేయ‌డం లైక్స్ కోసం ఆరాట‌ప‌డ‌డం చాలా కామ‌న్ విష‌యం అయిపోయింది. అయితే టిక్‌టాక్‌లో చాలా ఆప్ష‌న్ల గురించి జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌దు. వీడియోలు చేయ‌డం.. షేర్ చేయ‌డంపైనే ఎక్కువ‌గా దృష్టి సారిస్తారు. మ‌రి టిక్‌టాక్‌లో ఉన్న కొన్ని ఆప్ష‌న్లను ఉప‌యోగించుకుంటే మ‌న‌కు చాలా ఉప‌యోగాలు ఉన్నాయి. అందులో కీల‌క‌మైంది టిక్‌టాక్ డివైజ్ మేనేజ్‌మెంట్‌. ఇట‌వ‌లే టిక్‌టాక్ ఈ ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

ఏమిటి ఉప‌యోగం
టిక్‌టాక్ డివైజ్ మేనేజ్‌మెంట్‌ను ఉప‌యోగించి యూజ‌ర్లు సెష‌న్లు ఎండ్ చేయ‌చ్చు. ఇత‌ర డివైజ్‌ల నుంచి త‌మ అకౌంట్ల‌ను రిమూవ్ చేసుకోవ‌చ్చు. అన్నిటికంటే ముఖ్యంగా త‌మ అకౌంట్‌ను భ‌ద్రంగా ఉంచుకోవ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతుంది. టిక్ టాక్ అకౌంట్లు మిస్ యూజ్ కాకుండా చేయడంలో డివైజ్ మేనేజ్‌మెంట్‌ది కీల‌క‌పాత్ర‌.  భార‌త్‌లో ఉన్న 200 మిలియ‌న్ల యూజ‌ర్ల కోసం టిక్‌టాక్ కంపెనీ ప్ర‌త్యేకించి ఈ యాప్‌ను డివైజ్ చేసింది.  వాళ్ల‌ను ఎడ్యుకేట్ చేయ‌డం కూడా ఈ యాప్‌లో భాగం. ఆన్‌లైన్ ప్రెజెన్స్ త‌దిత‌ర వివ‌రాలు తెలుసుకోవడం కోసం ఈ ఆప్ష‌న్‌ని యూజ్ చేసుకోవ‌చ్చు. 

సేఫ్టీ ఫీచ‌ర్‌
టిక్‌టాక్ తాజాగా యాడ్ చేసిన ఈ ఫీచ‌ర్‌... ఇప్ప‌టికే ఉన్న 13 ఇండ‌స్ట్రీ సేఫ్టీ ఫీచ‌ర్ల‌కు అద‌నంగా చెప్పుకోవ‌చ్చు. భార‌త యూజ‌ర్ల‌ను ప్రొటెక్ట్ చేయ‌డం కోసం ప్ర‌త్యేకంగా ఈ ఫీచ‌ర్‌ను యాడ్ చేశారు. యాజ్ గేట్‌, రిస్ట్రిక్టెడ్ మోడ్‌, స్క్రీన్ టైమ్ మేనేజ్‌మెంట్, కామెంట్స్ ఫీల్ట‌ర్ లాంటి ఆప్ష‌న్లు క‌చ్చితంగా యూజ‌ర్ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. త‌మ వీడియోల‌ను మ‌రింత క్రియేటివ్‌గా త‌యారు చేసుకోవ‌డానికి కూడా డివైజ్ మేనేజ్‌మెంట్ హెల్ప్ చేస్తుంది. ఇందులోనే ఎడ్యుకేష‌ప‌న్ వీడియోలు కూడా ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ త‌దిత‌ర భాష‌ల్లో ఇవి ల‌భ్యం అవుతాయి. సుల‌భంగా అర్ధ‌మ‌య్యేలా ఈ వీడియోలు రూపొందించారు. ట్రెండ్స్‌ను తెలియ‌జేసే ఫ్లాట్‌ఫాంగా దీన్ని క్రియేట్ చేశారు. 

జన రంజకమైన వార్తలు