ఈఫీఎఫ్ఓ పూర్తి డిజిటల్ బాటలోకి వెళుతోంది. మాన్యువల్ ఆపరేషన్స్‌తో ఉన్న ఇబ్బందులన్నీ తొలగించేలా ఆన్‌లైన్ వ్యవస్థను మరింత పటిష్టపరచబోతోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్).. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరికీ భవిష్యత్తు అవసరాల కోసం శాలరీలో నుంచి కొంత కట్ చేసి, దానికి ఎంప్లాయర్ కొంత మొత్తం కలిపి ఈ ఫండ్‌కు జమ చేస్తారు. పిల్లల చదువులు, పెళ్లి, ఫ్లాట్,ప్లాట్ కొనుక్కున్నప్పుడో దీనిలో నుంచి అమౌంట్ తీసుకోవచ్చు. అయితే ఈ విత్‌డ్రాయల్ ఒకప్పుడు పెద్ద ప్రాసెస్.. ఈపీఎఫ్ అంతా ఆన్‌లైన్ అయ్యాక విత్‌డ్రాయల్ వారం, పది రోజుల్లో పూర్తయిపోతోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా యాప్ ద్వారా విత్ డ్రా చేసేసుకునే ఫెసిలిటీ రాబోతోంది. అదే వస్తే కోరుకున్న వెంటనే సొమ్ము చేతికందుతుంది. దేశంలోని నాలుగు కోట్ల మంది ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు ఇది నిజంగా గుడ్‌న్యూసే.
ఆల్ క్లెయిమ్స్.. వన్ యాప్
ఈపీఎఫ్‌కు సంబంధించిన అన్ని రకాల క్లెయింలను మొబైల్ అప్లికేషన్ ఉమాంగ్ (యూఎంఏఎన్‌జీ) ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆన్‌లైన్ లో సమస్యలను పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో కార్యాచరణ ప్రారంభించిందని సెంట్రల్ లేబర్ మినిస్టర్ దత్తాత్రేయ పార్లమెంట్లో చెప్పారు. దీనికోసం ‘యూనిఫైడ్ మొబైల్ యాప్ ఆఫ్ న్యూ ఏజ్ గవర్నెన్స్(ఉమాంగ్) యాప్‌ను ప్రారంభిస్తామన్నారు. దేశంలోని మొత్తం 110 ఈపీఎఫ్‌వో రీజనల్ ఈపీఎఫ్ ఆఫీసుల్లో ఎక్కువ శాతం సెంట్రల్ సర్వర్‌తో కనెక్ట్ అయ్యాయి. మొత్తం అన్నింటినీ సెంట్రల్ సర్వర్‌తో కనెక్ట్ చేస్తే ఇక ఈపీఎఫ్‌కు సంబంధించిన ఏ క్లెయిం కోసం కూడా ఆఫీస్ వైపు వెళ్లక్కర్లేదు. ఆన్‌లైన్‌లో చక్కబెట్టేసుకోవచ్చు.