డివైస్ లోని ఫైళ్లను ఎక్సటర్నల్ మెమొరీకి.. ఎక్సటర్నల్ నుంచి డివైస్ కు ఫైల్లను సులభంగా కాపీ చేయడానికి, మూవ్ చేయడానికి.. వేర్వేరు డివైస్ ల మధ్య ఫైళ్ల ట్రాన్సఫర్ కు కొత్త యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఏస్ ఫైల్ మెనేజర్ పేరిట వచ్చిన ఈ ఫైల్ మేనేజర్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.
ఏస్ ఫైల్ మేనేజర్ ద్వారా యూజర్లు తమ డివైస్‌లో ఉన్న ఫైల్స్‌ను సులభంగా మెమొరీ కార్డుకు మూవ్ లేదా కాపీ చేసుకోవచ్చు. మెమోరీ కార్డు నుంచి ఆ ఫైల్స్‌ను డివైస్ స్టోరేజ్‌కు కాపీ చేసుకోవచ్చు. దాదాపు అన్ని రకాల ఫైల్స్‌ను ఇది సులభంగా కాపీ, పేస్ట్ లేదా మూవ్ చేస్తుంది.
అంతేకాదు... ఇందులో ఉండే సూపర్ ఫాస్ట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌తో మరో ఫోన్‌కు ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అందుకు వైఫై ఉంటే చాలు, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. దీంతోపాటు డివైస్ స్టోరేజ్, మెమొరీ కార్డులలో ఉన్న ఫైల్స్‌ను సులభంగా వెదకవచ్చు. ఇక ఇందులో ఉన్న క్లీనర్ టూల్‌తో డివైస్‌లో పేరుకుపోయే జంక్ ఫైల్స్‌ను కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో డివైస్ వేగం పెరుగుతుంది.
మొత్తానికి ఆండ్రాయిడ్ డివైస్ లో అంతర్గతంగా కానీ, ఇతర డివైస్ లతో కానీ ఫైల్ల బదిలీకి ఇది అంత్యంత అనుకూలమైనదని టెక్ నిపుణులు చెప్తున్నారు.