పీడీఎఫ్ డాక్యుమెంట్లను టెక్స్టు రూపంలో మార్చుకోవడం తెలుసా... వాటిని టైప్ చేసే పనిలేకుండా ఈజీ మెథడ్ తీసుకొచ్చింది అడోబ్ సంస్థ. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన యాప్ ను రిలీజ్ చేసింది.
'అడోబ్ స్కాన్ (Adobe Scan)' పేరుతో రిలీజ్ చేసిన ఆ యాప్ తో ఏ డాక్యుమెంట్‌నైనా స్కాన్ చేస్తే చాలు అది ఇమేజ్‌గా మారుతుంది. ఆ తరువాత అందులో ఉండే టెక్ట్స్‌ను యాప్ డిటెక్ట్ చేస్తుంది. అనంతరం దాన్ని టెక్ట్స్ ఫైల్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎన్ని డాక్యుమెంట్లనైనా ఇలా సింపుల్‌గా టెక్ట్స్ ఫైల్స్‌లా మార్చేయొచ్చు.
ప్రస్తుతం ఈ యాప్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై పనిచేసేలా రూపొందించారు. ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్‌లో, ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్‌లో అయితే డివైస్ ఓఎస్ 5.0 ఆపైన ఉండాలి. అదే ఐఓఎస్ అయితే 10 ఉండాలి. ఈ యాప్ ద్వారా సేవ్ అయ్యే ఫైల్స్ అన్నీ అడోబ్ క్లౌడ్‌లో ఉంటాయి. కనుక ముందుగా యూజర్లు అడోబ్ క్లౌడ్ అకౌంట్ తెరవాలి. దీంతో క్లౌడ్‌లో సేవ్ అయిన ఫైల్స్‌ను తిరిగి మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో వాడుకునేందుకు వీలుంటుంది.