• తాజా వార్తలు

గూగుల్ ప్లే స్టోర్‌లో సగం యాంటి వైరస్ యాప్స్ ఫేకేనట

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ముందుగా గూగుల్ ప్లే స్లోర్ లో యాంటి వైరస్ యాప్స్ ఏం ఉన్నాయో వెతుకుతుంటారు. antivirus/anti-malware appలు గూగుల్ ప్లే స్టోర్ లు ఇప్పుడు లెక్కకు మించినవి ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఫేక్ యాప్ లేనట. వీటి ద్వారా ఫోన్లో సమాచారం హ్యాకింగ్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిపై చాలా జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ యాంటి వైరస్ యాప్ ల ద్వారా వారు మాల్ వేర్ లింకుని ఫోన్లోకి పంపిస్తున్నారు. ఎవరైనా ఈ యాప్ లను ఇన్ ప్టాల్ చేసినట్లయితే వెంటనే వారి మొబైల్ లోకి మాల్ వేర్ లింక్ వెళ్లిపోతుంది. ఈ లింక్ ద్వారా మన డేటా సమాచారాన్ని వారు ఈజీగా తస్కరించగలుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు.ఈ మధ్య దీనిపై ప్రయోగం జరిపిన Austrian antivirus testing company AV-Comparatives దీనిపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రెండు లేక మూడు కలిగిన యాంటి వైరస్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం సురక్షితం కాదని వారు చెబుతున్నారు. 

వారు దాదాపు 250 యాప్స్ మీద ప్రయోగాలు జరిపారు. 80 యాప్ లు మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చాయి. మిగతావి అన్నీ ప్రొటెక్షన్ ఇవ్వడంలో విఫలం అయ్యాయని వారు నిర్థారించారు. ప్రతి యాప్ ని సెపరేట్ డివైస్్ లో ఇన్ స్టాల్ చేసి చేశారు.  2018 నుండి దాదాపు 2000 malicious programs మీద ఈ ప్రయోగం చేశారు.కాగా బేసిక్ స్టాండర్డ్ లో కనీసం 30 శాతం వరకైనా మొబైల్ కి ఈ యాప్స్ ప్రొటెక్షన్ ఇవ్వాల. అయితే ఈ యాప్స్ ఈ విషయంలో విఫలం అయ్యాయి. స్కానింగ్ సమయంలో కూడా ఈ యాప్స్ ఎటువంటి రక్షణ ఇవ్వడం లేవని తేల్చారు. 

కాగా ఈ యాంటి వైరస్ యాప్స్ కేవలం యాడ్స్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టాయని తెలుస్తోంది. రక్షణ ఇవ్వడం కన్నా దాన్ని ఓపెన్ చేస్తే వచ్చే యాడ్స్ తో పెద్ద తలనొప్పిగా ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. ఇందులో భాగంగా సెక్యూరిటీ మరింతగా పెంచే యాప్స్ ని వీరు డెవలప్ చేస్తున్నారు.కాగా ఇప్పుడున్న యాంటి వైరస్ యాప్స్ లలో Kaspersky, AVG, McAfee, QuickHeal, and Symantec వంటి యాప్స్ మాత్రమే అత్యంత సెక్యూరిటీగా ఉన్నాయని తెలిపారు. వీటికి మీరు ఇప్పుడు కొంచెం ధర కూడా చెల్లించాల్సి రావచ్చు.   

జన రంజకమైన వార్తలు