• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉచితంగా సినిమాలు చూడాలా? అయితే ఈ టాప్ 5 యాప్స్ మీకోసం

ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఏలుతున్న సాధనాలలో సినిమాలు చూడడం అనేది ముందు వరుసలో ఉంటుంది. ఇది వాస్తవం. రోజువారీ పనులలో ఉండే ఒత్తిడిని తగ్గించి మనసుకు రిలాక్స్ ను అందించే సాధనంగా సినిమాలను చూడడాన్ని పరిగణించవచ్చు. సినిమా లను చూడడం అంటే థియేటర్ లకు వెళ్ళడం , లేదా కేబుల్ కనెక్షన్ ద్వారా ఇళ్లలోనే కూర్చుని చూడడం కొన్ని మార్గాలు. కొంతమంది లాప్ ట్యాప్ లు మరియు కంప్యూటర్ ల ద్వారా మూవీ లను ఇంట్లోనే కూర్చుని చూస్తారు. అయితే స్మార్ట్ ఫోన్ లు వచ్చాక మూవీ లు చూసే ట్రెండ్ మారిపోయింది. ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాక ఈ పోకడ మరింత ఆధునికతను సంతరించుకుంది. ఈ యాప్ లు మూవీ లు చూడడం అనే విషయాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చివేశాయి. ఇపుడు సినిమా లు చూడాలి అంటే థియేటర్ లలో కానీ మల్టీ ప్లెక్స్ లలో కానీ ఎక్కువ సమయం మరియు డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కేబుల్ కనెక్షన్ పై ఆధారపడవల్సిన అవసరం లేదు.మీకు నచ్చిన మీరు మెచ్చిన మూవీ లను మీ స్మార్ట్ ఫోన్ లోనే అదికూడా ఉచితంగా చూసే సౌకర్యాన్ని ఈ యాప్ లు కల్పిస్తున్నాయి. దీనికి మీరు చేయవలసిందల్లా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ మూవీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడమే. ఇలాంటి యాప్ లు అనేకం అందుబాటులో ఉన్నాయి కదా! మరి వీటిలో బెస్ట్ ఏవి? వేటిని సెలక్ట్ చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉచితంగా సినిమా లు చూడడానికి ఉన్న యాప్ లలో టాప్ 5 యాప్స్ మీకోసం ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం.
1. సినిమా బాక్స్ ( Cinema Box HD )
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో సినిమాలను చూడడానికి ఉన్న ఉచిత యాప్ లలో ఈ సినిమా బాక్స్ HD యాప్ ప్రధానమైనది. ఇందులో బెస్ట్ ఏమిటంటే ఇందులో మీరు మూవీ లు చూడడానికి ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు. మీరు ఇందులో హై డెఫినిషన్ మూవీ లను మరియు టీవీ షో లను చూడవచ్చు.ఈ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ తో పాటు మీరు మీకు నచ్చిన మూవీ లను డౌన్ లోడ్ చేసుకుని వాటిని ఆఫ్ లైన్ లో కూడా చూడవచ్చు.అంతేగాక ఈ సినిమా బాక్స్ యాప్ గూగుల్ క్రోమ్ క్యాస్ట్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు మీ స్మార్ట్ ఫోన్ ను మీ ఇంటి లో ఉన్న LED టీవీ కి కనెక్ట్ చేసి మీకు నచ్చిన మూవీ ని పెద్ద స్క్రీన్ లో కూడా చూడవచ్చు.
2. టుబి టీవీ ( Tubi TV )
ఇది మరొకల ఉచిత మూవీ యాప్. ఇక్కడ మీరు కొన్ని వేల సంఖ్య లో మూవీ లను చూడవచ్చు. దీనియొక్క లేటెస్ట్ ఎడిషన్ అన్ని రకాల మేజర్ డిజిటల్ ప్లాట్ ఫాం లను సపోర్ట్ చేయడo తో పాటు హై క్వాలిటీ వీడియో లను మరియు మూవీ లను స్ట్రీమ్ చేస్తుంది. ఇందులో ఉన్న మొత్తం 40, 000 ల మూవీ లలో మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకుని చూడవచ్చు.
3. క్రాకిల్ ( crackle )
సినిమా ప్రేమికులకు నచ్చే మరొక ఆసక్తికరమైన మూవీ స్ట్రీమింగ్ యాప్ ఇది. ఈ యాప్ డౌన్ లోడింగ్ ఆప్షన్ ను కలిగిఉండదు. కాబట్టి మీరు స్ట్రీమింగ్ ద్వారానే మూవీ లను చూడవలసి ఉంటుంది. ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ యూజర్ లకు ఇది ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని కలిగించే యాప్ అవుతుంది. ఇందులో ఉండే మూవీ లైబ్రరీ లో అనేక భాషలకు చెందిన కొన్ని వేల సినిమా లు ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన వాటిని ఉచితంగా చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
4. షో బాక్స్ ( show box )
షో బాక్స్ అనే యాప్ ఇది అందించే అద్భుతమైన మూవీ ల ద్వారా యూజర్ లలో విపరీతమైన పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇప్పటికే కొన్ని మిలియన్ ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది ఆండ్రాయిడ్ యూజర్ లకు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండడమే గాక దానియొక్క అధికారిక వెబ్ సైట్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో డౌన్ లోడింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు ఆఫ్ లైన్ లో కూడా మూవీ లను ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఈ మూవీ లను pc లేదా లాప్ టాప్ లో చూడాలన్నా సరే ఈ యాప్ ద్వారా చూడవచ్చు,
5. పాప్ కార్న్ ఫ్లిక్స్ ( Popcorn Flix )
నెట్ ఫ్లిక్స్ మాదిరిగానీ ఈ పాప్ కార్న్ ఫ్లిక్స్ కూడా ఒక మూవీ స్ట్రీమింగ్ యాప్ కానీ మిగతా మూవీ యాప్ లతో పోలిస్తే పూర్తీ విభిన్నంగా ఇది ఉంటుంది. వివిధ భాషలలో మరియు వివిధ జానర్ లకు చెందిన కొన్ని వేల మూవీ లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటన్నింటినీ మీరు ఉచితంగా చూడవచ్చు. అంతేగాక పాప్ కార్న్ ఫ్ల్లిక్స్ కు యాడ్ ఆన్ చేసుకోవడం ద్వారా ఈ మూవీ లను మీరు డైలీ బేసిస్ గా కూడా చూడవచ్చు. ఈ యాప్ కేవలం మూవీ లను మాత్రమే గాక డాక్యుమెంటరీ లు, టీవీ షో లు కూడా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది.

జన రంజకమైన వార్తలు