ఫ్రెండ్ పెళ్లికి వెళ్లారు.. మీరు, మరో ఫ్రెండ్ పోటీ పడి చెరో యాంగిల్ నుంచి స్మార్ట్ ఫోన్లతో వీడియోలు తెగ తీశారు. కానీ వాటిని మిక్స్ చేయడం ఎలా.. స్మార్టు ఫోన్లో ఆ పని చేయాలంటే ఏదో ఒక యాప్ కావాలి... కానీ, దానికి ఇంకో యాప్ అవసరం కదా. అలా మరో యాప్ అవసరం లేకుండా ఒకే సారి వీడియో క్యాప్చర్ చేయడానికి, వాటిని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చక్కగా కలపడానికి ఓ యాప్ అందుబాటులో కి వచ్చేసింది.దాని పేరు డ్యుయోమూవ్(duomov).
స్మార్ట్ ఫోన్లలో కెమెరా కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ వీడియో షూటింగ్ కూడా ఈజీ అయింది. చేతులు షేక్ అయినా కూడా వీడియో ఎలాంటి బ్లర్ లేకుండా వస్తోంది. దీంతో డెవలపర్స్ కొత్త విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు. వాటి ఫలితమే ఈ డ్యుయోమూవ్ యాప్.
ఎలా పనిచేస్తుంది?
* డుయోమూవ్ యాప్ ను వీడియో తీసే ఇద్దరూ డౌన్లోడ్ చేసుకోవాలి.
* తర్వాత షేరిట్ లో మాదిరిగా ఒకరు రిక్వెస్ట్ పంపితే రెండో వాళ్లు యాక్సెప్ట్ చేయాలి.
* అప్పుడు రెండు ఫోన్ లూ పెయిర్ అవుతాయి.
* తర్వాత ఇద్దరూ వైఫై సిగ్నల్స్ అందేంత దూరంలో ఉండి ఏదైనా ఓ ఫంక్షన్ లేదా ఈవెంట్ ను చెరో యాంగిల్ నుంచి వీడియో తీయొచ్చు.
* మీ షూటింగ్ పూర్తవగానే రెండు వీడియో క్లిప్పింగ్స్ ను యాప్ మిక్స్ చేస్తుంది.
* ఎలాంటి ఫ్లాస్, ఆడియో డిస్ట్రబెన్సులు లేకుండా వీడియో వస్తుంది.
ఇవి కూడా ఉంటే..
* ప్రస్తుతం ఇందులో మైన్యూట్ లెవల్ లో క్రాప్ చేసే టూల్స్, ఫిల్టర్స్ లేవు.
* ప్రస్తుతానికి ఇద్దరి కి మాత్రమే పనిచేస్తుంది. ఇంకా ఎక్కువ మంది ఒకేసారి వీడియోలు తీసి మిక్స్ చేసే వీలుంటే బాగుంటుంది.
* బాగా దగ్గర లో ఉండి షూట్ చేయాలి.
* ప్రస్తుతం ఐఓఎస్ డివైస్ లకే అందుబాటు లో ఉంది. అయితే.. త్వరలోనే ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా రాబోతోంది.