ఇండియన్ ఈ కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ మరో భారీ స్టెప్ వేస్తోంది. ఈసారి సరికొత్త సర్వీసులతో ముందుకొస్తోంది. ఎలాంటి సర్వీసైనా ఫ్లిప్ కార్టులో దొరికేలా ' ఎవ్రీథింగ్ యాప్' పేరుతో ఓ మెగా యాప్ ను లాంచ్ చేయబోతోంది.
కాగా ఈ మెగా యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, టూర్స్ ప్లానింగ్ ఇంకా నిత్యవాడుకలో అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. దీనికోసం ఫుడ్, క్యాబ్, ట్రావెల్ అగ్రిగేటర్లను భాగస్వాములుగా చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
ఈ మెగా యాప్ ను 2017 డిసెంబరు నాటికి లాంఛ్ చేయాలన్నది ఫ్లిప్ కార్టు ప్లాన్. ఫ్లిప్ కార్ట్ యాప్ డిజైన్, ఇంజనీరింగ్ టీమ్ దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ఇటీవల లాంచ్ చేసిన ఆరియో మాదిరి వినియోగదారుల సేవలనే ఫ్లిప్ కార్ట్ వాల్యు యాడెడ్ సర్వీసులు అందజేయనున్నాయి. కంపెనీ త్వరలోనే గ్రోసరీ, ఫాస్ట్-మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ను ఆఫర్ చేయనుంది. ఈ వ్యూహం ఫలించడం కోసం ఈ యాప్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది.