• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో 100 కోట్ల భార‌తీయులు.. అదే గూగుల్ ల‌క్ష్యం

100 కోట్ల మంది భార‌తీయులు బ్రాడ్ బ్యాండ్ యూజ‌ర్లుగా మారి, ఒక్కొక్క‌రు నెల‌కు 10 జీబీ డాటాను వినియోగించ‌డ‌మే గూగుల్ ల‌క్ష్యం. ఇండియా పొటెన్షియల్ అప్పుడే పూర్తిస్థాయిలో వినియోగించిన‌ట్లు అవుతుంద‌ని గూగుల్ భావిస్తోంది. ఇంట‌ర్నెట్ స్పేస్ ప్రొవైడ‌ర్లు, టెలికం కంపెనీలు, కంటెంట్ ప్లేయ‌ర్లు, గ‌వ‌ర్న‌మెంట్ కూడా భాగ‌స్వాములైన‌ప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని గూగుల్ ఇండియా క‌నెక్టివిటీ కంట్రీ హెడ్ గుల్జార్ ఆజాద్ చెప్పారు.
డాటా రివ‌ల్యూష‌న్‌కు టైం కావాలి
ఇండియాలో డాటా రివ‌ల్యూష‌న్‌కు ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆజాద్ చెప్పారు. డాటా అనేది ఆప‌రేట‌ర్ల వైపు నుంచే కాకుండా గవ‌ర్న‌మెంట్ విజ‌న్ కూ ఉప‌యోగ‌ప‌డాలి. ప్ర‌తి ఇంట‌ర్నెట్ యూజర్ 10 జీబీ డాటాను వినియోగించ‌డం అనే ల‌క్ష్యాన్ని మేం నాలుగైదేళ్ల‌లో సాధించ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం ఉంది.
గ‌త సంవ‌త్స‌ర కాలంగా మేం రైల్వేల్లో వైఫై పై దృష్టి పెట్టాం. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా 110 స్టేష‌న్ల‌లో వైఫై స‌దుపాయం క‌ల్పిస్తాం. యూజ‌ర్లు, గ‌వ‌ర్న‌మెంట్‌, ఇండస్ట్రీ ల డాటా వినియోగ స్థాయి ఎలా అభివృద్ధి చెంద‌బోతుంద‌నే దాన్ని మేం ఆసక్తిక‌రంగా ప‌రిశీలిస్తున్నాం. అందుకే మేం ప్రొడక్ట్ ప్లాట్‌ఫారం క్రియేష‌న్‌పై దృష్టి పెట్టాం. న‌మ్మ‌క‌మైన‌, వేగ‌వంత‌మైన‌, సెక్యూర్డ్ వైఫై కోసం గూగుల్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నాం. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే భాగ‌స్వాముల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్ప‌టికే పుణె స్టేష‌న్‌లో దీన్ని ఏర్పాటు చేశాం. లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ)తో డిస్క‌స్ చేస్తున్నాం. కొన్ని ఐఎస్‌పీల‌తో కూడా ఇంట‌రాక్ట్ అయ్యాం. అందులో కొన్ని భాగ‌స్వామ్యాల వ‌ర‌కు కూడా వ‌చ్చాయి.
4జీ, ప‌బ్లిక్ వైఫై క‌లిసి ముందుకెళ్లాలి
3జీ, 4జీ నెట్‌వ‌ర్క్‌ల‌తోపాటు ప‌బ్లిక్ వైఫై కూడా ఎమ‌ర్జ్ అవుతోంది. ఇండియా డాటా విజ‌న్‌ను చేరుకోవాలంటే 4జీ , ప‌బ్లిక్ వైఫై క‌లిసి ముందుకెళ్లాలి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఈ దిశ‌గా ఆలోచిస్తున్నాయి. అయితే దీనిలో ఇంకా పురోగతి సాధించాల్సి ఉంది.
400 రైల్వే స్టేష‌న్ల‌లో రైల్‌టెల్ వైఫై
ఇండియాలో 115 రైల్వేస్టేష‌న్లు లైవ్‌లో ఉన్నాయి. రైల్‌టెల్‌తో క‌లిసి 400 స్టేష‌న్ల‌లో హైస్పీడ్ నెట్‌వ‌ర్క్ క్రియేట్ చేయాల‌నేది గూగుల్ ల‌క్ష్యం. నెల‌కు ఆరు ల‌క్ష‌ల మంది యూజ‌ర్లు ప్ర‌స్తుతం ఉన్నారు. ఈ సంఖ్య‌ను భారీగా పెంచుకునేందుకు అవ‌కాశం ఉంది అని ఆజాద్ ప్ర‌క‌టించారు.

జన రంజకమైన వార్తలు