రోజువారీ దినచర్యలో ఎప్పటి నుంచో టీవీ చూడడం ఒక భాగమైపోయింది. కాసేపయినా రిలాక్స్ అవ్వాలంటే రిమోట్ పట్టి ఏదో ఒక చానెల్ మార్చుతూ పోయేవాళ్లు ఎక్కువైపోయారు. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇప్పటిదాకా 4కే యూహెచ్‌డీ టీవీలతో మనం ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి నాలుగు రెట్లు ఎక్కువ క్వాలిటీతో కనిపించే బొమ్మలు మన ముందు కదులుతుంటే ఎంత బాగుంటుందో కదా! 33 మిలియన్ పిక్సెల్స్‌తో 8కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఈ టీవీ అదరగొడుతుంది. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ ఈ టీవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది.
దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ తన లేటెస్ట్ ఓఎల్ఈడీ టీవీని ఎల్‌జీ ఓఎల్ఈడీ88జెడ్9 పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రపంచంలో కస్టమర్ల ముందుకు రాబోతోన్న తొలి 8కే ఓఎల్ఈడీ టీవీ ఇదే. LG 8K TVలో 88 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దక్షిణ కొరియాలో ఈ టీవీల కోసం ప్రిఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. 2019 మూడో త్రైమాసికంలో కంపెనీ ఈ టీవీలను ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ టీవీ ధర ఎంతో తెలియాల్సి ఉంది. అయితే ధర 42,000 డాలర్లుగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. మన కరెన్సీలో టీవీ ధర దాదాపు రూ.29.4 లక్షలుగా ఉండనుంది.
4కే టీవీతో పోలిస్తే ఇందులో పిక్చర్ 4 రెట్లు షార్ప్‌గా కనిపిస్తుంది. ఫుల్ హెచ్‌డీ టీవీలతో పోలిస్తే 16 రెట్లు షార్ప్‌గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో 8కే కంటెంట్ చాలా తక్కువగా అందుబాటులో ఉంది.Google Assistant and Amazon Alexa వంటి వాటిని సపోర్ట్ చేయనుంది. LG's second-gen Alpha 9 Gen 2 8K intelligent processorతో రానుంది. సౌండ్ క్వాలిటీ కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు.
గతేడాది లాస్ వెగాస్‌లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భాగంగా మడతపెట్టగలిగే 65 అంగుళాల 4కే యూహెచ్‌డీ ఓఎల్‌ఈడీ టీవీని పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మూడేళ్ల కిందట మడతపెట్టగలిగే 18 అంగుళాల ఓఎల్‌ఈడీ టీవీని తీసుకొస్తామని ప్రకటించిన ఎల్‌జీ.. ఇప్పుడు దాని కంటే ఎంతో పెద్దదైన టీవీని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసి ఐపీఎస్ నానో కలర్, యూ ఐపీఎస్‌లను అమలు చేయనున్నట్లు ఎల్‌జీకి చెందిన డిస్‌ప్లే డివిజన్ ఇప్పటికే ప్రకటించింది.