• తాజా వార్తలు

ఫోన్ నెంబ‌ర్ అక్క‌ర్లేకుండా ఫేస్‌బుక్ టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌ను సెట్ చేసుకోవ‌డం ఎలా?

ఫేస్‌బుక్‌లో యూజ‌ర్ల ప్రైవ‌సీ కోసం టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ ఫెసిలిటీ ఉంది. అంటే పాస్‌వ‌ర్డ్ ఒక్క‌టే కాకుండా మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ కూడా వ‌చ్చేలా  సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో ఎవ‌రైనా మ‌న పాస్‌వ‌ర్డ్ కొట్టేసి మ‌న ఫేస్‌బుక్ అకౌంట్ యాక్సెస్ చేయాల‌న్నా వీలుప‌డ‌దు. అయితే ఇలా టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్‌కు మొబైల్ నెంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి. అయితే ఇలా మొబైల్ నెంబ‌ర్ ఇచ్చిన‌ప్పుడు దానికి ఓటీపీ పంపితే ఓకే. కానీ టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ సిస్ట‌మ్‌లో ఉన్న ఓ బ‌గ్ నాన్ సెక్యూరిటీ రిలేటెడ్ ఐట‌మ్స్‌ను కూడా పంపిస్తోంది. దీంతో కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయని గుర్తించిన ఫేస్‌బుక్  మొబైల్ నెంబ‌ర్ అవ‌స‌రం లేకుండానే టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ చేసుకునేలా వీలు క‌ల్పించింది.

ఇదీ ప‌ద్ధ‌తి

1. ఫేస్‌బుక్ ఓపెన్ చేసి అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. జ‌న‌ర‌ల్ సెట్టింగ్స్ ట్యాబ్ కింద ఎడ‌మ వైపు Security and Login అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

2. దాన్ని క్లిక్ చేసి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే  Use Two-factor authentication అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాని ముందున్న Edit ఆప్ష‌న్ క్లిక్ చేయండి 

3.త‌ర్వాత విండోలో Get Started అనే బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దాన్నిక్లిక్ చేస్తే టెక్స్ట్ మెసేజ్ విత్ mobile,  authenticator app అనే రెండు ఆప్ష‌న్స్ క‌నిపిస్తాయి.

4. మీ ఫోన్ నెంబ‌ర్‌తో టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ సెట్ చేసుకోవాలంటే మొబైల్ కిందున్న స‌ర్కిల్‌లో నొక్కండి. లేదంటే అథెంటికేట‌ర్ యాప్ కింద క్లిక్ చేయండి.  

5.త‌ర్వాత విండోలో మీకు ఓ క్యూఆర్ కోడ్ క‌నిపిస్తుంది. గూగుల్ డుయో లేదా గూగుల్ అథెంటికేట‌ర్ యాప్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే  మీ ఎఫ్‌బీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. లేదంటే అక్క‌డే కోడ్ క‌నిపిస్తుంది. దాన్ని త‌ర్వాత విండోలో ఎంట‌ర్ చేయండి. అప్పుడే మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.

మొబైల్ యాప్‌లో కూడా ఇదే విధానంతో టూ ఫ్యాక్ట‌ర్ అథెంటికేష‌న్ సెట్ చేసుకోవ‌చ్చు.  ప్ర‌స్తుతం కొద్దిగా టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ ఉన్నా త్వ‌ర‌లోనే అంద‌రికీ ఈ ఫీచ‌ర్ అనేబుల్ చేసుకోవ‌చ్చ‌ని ఫేస్‌బుక్ చెబుతోంది. 

జన రంజకమైన వార్తలు